Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.....

Sarkaru Vaari Paata Trailer To Be Played In Acharya Theatres
Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల మోత మోగిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ గ్లింప్స్, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం మహేష్ ఫ్యాన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ ‘ఆచార్య’ మహేష్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వడం ఏమిటి అనుకుంటున్నారా..?
Acharya: ‘ఆచార్య’లో ఆ సీన్ ఇష్టమంటోన్న చరణ్.. గూస్బంప్స్ గ్యారెంటీ!
సర్కారు వారి పాట చిత్ర ట్రైలర్‌ను ఏప్రిల్ 29న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే రోజున మెగాస్టార్ ఆచార్య కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అయితే ఆచార్య రిలీజ్ అయ్యే అన్ని థియేటర్లలో సర్కారు వారి పాట ట్రైలర్‌ను ప్లే చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే గనక నిజం అయితే, అటు మెగా ఫ్యాన్స్‌తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా ఆచార్య కోసం థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం.
Sarkaru Vaari Paata: కళావతి @ 150 మిలియన్
ఏదేమైనా ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ రోజున మరో స్టార్ హీరో సినిమా ట్రైలర్‌ను థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆచార్య సినిమాలో మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆచార్య మహేష్ ఫ్యాన్స్‌కు ఇలా ట్రీట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే సర్కారు వారి పాట ట్రైలర్‌ను ఆచార్య పట్టుకొస్తాడా లేడా అనేది ఏప్రిల్ 29న తేలిపోనుంది.