Acharya: ‘ఆచార్య’లో ఆ సీన్ ఇష్టమంటోన్న చరణ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో...

Acharya: ‘ఆచార్య’లో ఆ సీన్ ఇష్టమంటోన్న చరణ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ!

Leopard Scene In Acharya Is Favourite For Ram Charan

Updated On : April 26, 2022 / 6:47 PM IST

Acharya: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు పాత్రలో తన సత్తా చాటిన చరణ్, తాజాగా ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మెయిన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో చరణ్ మనకు కనిపించనున్నాడు.

Acharya: ఆచార్య రిలీజ్ ప్రెస్ మీట్.. Photos

అయితే ఆచార్య చిత్రంలో చరణ్ పాత్ర చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆయన సిద్ధ అనే పాత్రలో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో చిరు, చరణ్ కలిసి చేసే సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా చిరంజీవి, చరణ్, పూజా హెగ్డే, కొరటాల మీడియావారితో ముచ్చటించారు. ఈ క్రమంలోనే చరణ్‌కు ఆచార్య సినిమాలో ఏ సీన్ అంటే ఇష్టమని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చరణ్ తన తండ్రితో చేసిన ఓ సీన్ గురించి చెప్పుకొచ్చాడు.

Acharya: చిరు చిలిపితనానికి నీలాంబరి ఫిదా!

చిరుతో కలిసి చరణ్ నక్సలైట్‌గా ఉన్నప్పుడు అడవిలో చిరుతపులి కనిపించే సీన్ తనకు అన్నింటికంటే ఇష్టమని పేర్కొన్నాడు. ఈ సీన్ గురించి తనకు పూర్తిగా తెలియకుండానే చిత్ర యూనిట్ షూటింగ్ చేసిందని.. తాను ఇదొక మాంటేజ్ షాట్ అయ్యి ఉంటుందని భావించానని చెప్పుకొచ్చాడు. కానీ కొరటాల శివ అసలు సీన్‌ను తనకు చూపించి సర్‌ప్రైజ్ చేశారని.. అందుకే ఈ సీన్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపాడు. చిరుత పులులు తమను దగ్గర్నుండి చూస్తున్న సీన్ చూస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా గూస్‌బంప్స్ వస్తాయని చరణ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఆయనకు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.