Jathara : ‘జాతర’ ట్రైలర్ చూశారా..? అమ్మోరు నేపథ్యంలో..

తాజాగా జాతర ట్రైలర్ రిలీజ్ చేసారు.

Sathish Babu Ratakonda Deeya Raj Jathara Movie Trailer Released

Jathara : గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సి, రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ‘జాతర’. సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా జాతర ట్రైలర్ రిలీజ్ చేసారు.

Also Read : Kiran Abbavaram : స్కూల్ లవ్ స్టోరీ రివీల్ చేసిన ఫ్రెండ్.. ఫైర్ అయిన కిరణ్ అబ్బవరం..

ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. అమ్మోరు తల్లి ఊరు వదిలి వెళ్ళిపోయింది అంటూ ప్రారంభమై ఓ ఊర్లో గొడవలు, అమ్మవారు, ఆలయం చుట్టూ ఈ కథ తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా కూడా ఫుల్ రా & రస్టిక్ గా ఉండబోతున్నట్టు అర్ధమవుతుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్‌లో జరిగే జాతర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 8న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో దీయా రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.