Satya Raj Tribanadhari Barbarik Movie Feel Good Song Released
Tribanadhari Barbarik Song : వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మాణంలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా త్రిబాణధారి బార్బరిక్. సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్‌లతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Dear Uma : ‘డియర్ ఉమ’ రిలీజ్ డేట్ అనౌన్స్.. హీరోయిన్ నిర్మాతగా..
తాజాగా ఈ సినిమా నుంచి ఫీల్ గుడ్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘అనగా అనగా కథలా..’ అంటూ సాగే ఈ పాటను టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో మూవీ యూనిట్ రిలీజ్ చేసారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన సంగీతంలో సనరే ఈ పాట రాయగా కార్తిక్ పాడారు. మీరు కూడా ఈ పాట వినేయండి..
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో సత్య రాజ్ మాట్లాడుతూ .. పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. కాలేజీ విద్యార్థులు ఎనర్జీ, ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది త్వరలోనే ఆడియెన్స్ ముందుకు ఈ సినిమా రాబోతోంది అని అన్నారు.
డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. నా మొదటి హీరో సత్య రాజ్ గారు అవ్వడం నా అదృష్టం. 170 సినిమాల్లో హీరోగా చేసిన సత్య రాజ్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాలో పాటను ఈ కాలేజీలో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది అని అన్నారు. నిర్మాత విజయ్‌పాల్ రెడ్డి అడిదాల టీకేఆర్ కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డికి కాలేజీలో సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించినందుకు థ్యాంక్స్ చెప్పారు.