Satyadev Interesting Comments on his Chiranjeevi Songs Dance
Satyadev : హీరో సత్యదేవ్ జీబ్రా సినిమా నవంబర్ 22న రిలీజ్ కానుంది. ఇటీవల ఈ సినిమా ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో సత్యదేవ్ చిరంజీవి పాటలకు అదిరిపోయే డ్యాన్స్ వేశారు. ఠాగూర్, ముఠామేస్త్రి సినిమాల్లోని పాటలకు సత్యదేవ్ డ్యాన్స్ వేసాడు. ఆ ఆడియన్స్ చూస్తే సత్యదేవ్ బాగా ప్రాక్టీస్ చేసి వేసాడని అంతా అనుకుంటారు.
అయితే సత్యదేవ్ డ్యాన్స్ ప్రాక్టీస్ లేకుండానే డైరెక్ట్ ఆ టైంకి స్టేజ్ మీద పిలిస్తే వెళ్లి డ్యాన్స్ వేసాడట. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఆ రోజు డ్యాన్స్ అదరగొట్టారు, చిరంజీవి ముందు చేయాలని బాగా ప్రాక్టీస్ చేసారా అని అడిగారు.
Also Read : Allu Arjun – Allu Arha : కూతురు క్యూట్ రీల్ షేర్ చేసి.. స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన అల్లు అర్జున్..
దీనికి సత్యదేవ్ సమాధానమిస్తూ.. ఆ డ్యాన్స్ కోసం నేను ప్రాక్టీస్ ఏం చేయలేదు. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి డ్యాన్స్ లు చేసేవాడ్ని. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు వైజాగ్ లో లైమ్కా ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కు సోనాలి బింద్రే అతిథిగా వచ్చారు. అప్పుడు కూడా ఇదే డ్యాన్స్ చేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నాను. నిద్రలో లేపి అడిగినా చిరంజీవి గారి పాటలకు అవే స్టెప్పులు వేస్తాను. ఇప్పుడు చిరంజీవి గారి ముందు కూడా పాట ప్లే చేయగానే అవే స్టెప్స్ ఆటోమేటిక్ గా వేసాను అని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సత్యదేవ్ చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్ అని చెప్పుకోవడంలో తప్పులేదు అని అంటున్నారు.