Allu Arjun – Allu Arha : కూతురు క్యూట్ రీల్ షేర్ చేసి.. స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పిన అల్లు అర్జున్..
తాజాగా నేడు అర్హ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ తన కూతురు అర్హ క్యూట్ రీల్ ఒకటి పోస్ట్ చేసి..

Allu Arjun Shares Cute Reel and says Special Birthday Wishes ro Allu Arha
Allu Arjun – Allu Arha : అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ, కొడుకు అల్లు అయాన్ కూడా బాగా పాపులర్. బన్నీ భార్య రెగ్యులర్ గా పిల్లల వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా బన్నీ పిల్లల ఫొటోలు వస్తే వైరల్ చేస్తారు. ఇక అల్లు అర్జున్ రేర్ గా తన పిల్లల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు. నిన్నే అల్లు అర్జున్ తన కూతురితో కలిసి దిగిన క్యూట్ ఫోటో ఒకటి షేర్ చేసాడు.
Also Read : Pushpa 2 : మొన్న నార్త్ అయింది.. ఇప్పుడు సౌత్.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో.. ఎప్పుడంటే..?
తాజాగా నేడు అర్హ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ తన కూతురు అర్హ క్యూట్ రీల్ ఒకటి పోస్ట్ చేసి.. నా లైఫ్ సంతోషానికి హ్యాపీ బర్త్ డే. మై లిటిల్ అర్హ, అప్పుడే 8 ఏళ్ళు అయ్యాయి, నువ్వు రావడం నా జీవితం మరింత సంతోషంగా మారింది. బోలెడంత ప్రేమతో, హగ్గులతో, ముద్దులతో మీ నాన్న అంటూ పోస్ట్ చేసారు. దీంతో బన్నీ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఫ్యాన్స్, నెటిజన్లు అల్లు అర్హకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు.
ఇటీవలే అర్హ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ తో కలిసి వచ్చి సందడి చేసింది. ఈ షోలో అర్హ తెలుగులో పదో తరగతి పద్యం చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అర్హకు ఇంత బాగా తెలుగు వచ్చా అని ఈ షో తర్వాత అందరూ చర్చించుకున్నారు. ఇప్పటికే అర్హ శాకుంతలం సినిమాలో కూడా నటించింది. మరి ఫ్యూచర్ లో అర్హ సినిమాల్లోకి వస్తుందా చూడాలి.