Pushpa 2 : మొన్న నార్త్ అయింది.. ఇప్పుడు సౌత్.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో.. ఎప్పుడంటే..?

పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో మరోసారి నార్త్ లో పుష్ప, అల్లు అర్జున్ హవా అందరికి తెలిసింది.

Pushpa 2 : మొన్న నార్త్ అయింది.. ఇప్పుడు సౌత్.. పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ చెన్నైలో.. ఎప్పుడంటే..?

Allu Arjun Pushpa 2 Wild Fire Event in Chennai Details Here

Updated On : November 21, 2024 / 6:53 AM IST

Pushpa 2 : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ వచ్చి మరిన్ని అంచనాలు పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇటీవల పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బీహార్ పాట్నాలో ఘనంగా చేసిన సంగతి తెలిసిందే. ఒక సినిమా ట్రైలర్ ఈవెంట్ నార్త్ లో రెండు లక్షల జనాల మధ్య బహిరంగ ఈవెంట్ గా చేయడం ఇదే మొదటి సారి.

పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో మరోసారి నార్త్ లో పుష్ప, అల్లు అర్జున్ హవా అందరికి తెలిసింది. ఈవెంట్ జరిగి కొన్ని రోజులు అవుతున్నా ఇంకా పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ గురించే మాట్లాడుతున్నారంటే ఆ ఈవెంట్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పక్కర్లేదు. పాట్నా ఈవెంట్ తో నార్త్ లో పుష్ప 2 కి డోర్స్ ఓపెన్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు సౌత్ లో తన హవా చూపించబోతున్నాడు. తెలుగు రాష్ట్రాలు, కేరళ ఎలాగో అల్లు అర్జున్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

Also Read : Ashok Galla : మహేష్ మామతో మేనల్లుడు.. దేవకీ నందన వాసుదేవ కోసం..

అందుకే సౌత్ లో మొదట చెన్నైలో ఈవెంట్ చేస్తున్నారు. తాజాగా చెన్నై ఈవెంట్ డీటెయిల్స్ ప్రకటించారు పుష్ప 2 టీమ్. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ నవంబర్ 24 న సాయంత్రం 5 గంటలకు చెన్నైలోని సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయనున్నారు. దీంతో ఈ ఈవెంట్ పై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి. మరి చెన్నైలో ఈవెంట్ తమిళనాడులో పుష్ప 2 కి ఏ రేంజ్ లో హెల్ప్ అవుతుందో చూడాలి. అదే రోజు పుష్ప 2 సినిమాలోని శ్రీలీలే చేసిన స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం.

Image