Ashok Galla : మహేష్ మామతో మేనల్లుడు.. దేవకీ నందన వాసుదేవ కోసం..
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’.

Mahesh Babu promotions for Ashok Galla Devaki Nandana Vasudeva movie
Ashok Galla : సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. ఇక ఈ సినిమా మెకానిక్ రాకీ సినిమాకి పోటీగా నవంబర్ 22న గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవల ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ సైతం రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఇందులో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు.
Also Read : Vishwak Sen : విశ్వక్ మూవీ లైనప్ మాములుగా లేదుగా.. స్టార్ హీరోలకు కూడా ఇన్ని సినిమాలు లేవు
అయితే అశోక్ గల్లా మహేష్ బాబు మేనల్లుడు కావడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కి బాబు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా అశోక్ గల్లా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసాడు. మహేష్ బాబు తో సూపర్ స్టార్ ఫన్ క్రియేట్ చేద్దాం.. అస్క్ SSMB అని ఓ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. అలాగే మహేష్ బాబుతో అశోక్ గల్లా దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.
We are LIVE NOW!🦁
Let’s have some superstar fun 😉#AskSSMBandAG#DevakiNandanaVasudeva#DNVreleasingOnNov22nd pic.twitter.com/8GlPml8FUs
— Ashok Galla (@AshokGalla_) November 20, 2024
ఇకపోతే తమ సినిమా కోసం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబునే రంగంలోకి దింపారు ‘దేవకీ నందన వాసుదేవ’ టీమ్. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యగా ఇప్పుడు మహేష్ బాబు సైతం దీనికి తోడయ్యారు. మరి స్వయంగా మహేష్ బాబు ప్రోమోట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.