Satyadev : నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే అని నా ఫోన్ తీసుకొని.. చిరంజీవిపై సత్యదేవ్ కామెంట్స్.. ఇది కదా మెగాస్టార్ అంటే..

సత్యదేవ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి - చిరంజీవికి మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Satyadev Interesting Comments on Megastar Chiranjeevi

Satyadev : క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా ఎదిగాడు సత్యదేవ్. సత్యదేవ్ మెగాస్టార్ కి వీరాభిమాని అని తెలిసిందే. సత్యదేవ్ బ్లఫ్ మాస్టర్ సినిమా వచ్చినపుడు చిరంజీవి ఆ సినిమా చూసి తనే సత్యదేవ్ ని పిలిపించి అభినందించారు. అతని జర్నీ గురించి తెలుసుకున్నారని సత్యదేవ్ పలుమార్లు తెలిపాడు. తన కెరీర్ కి ప్లస్ అయ్యేలా చిరంజీవి గారే పిలిచి గాడ్ ఫాదర్ సినిమాలో తన పక్కన విలన్ ఛాన్స్ ఇచ్చారని కూడా చెప్పాడు సత్య.

సత్య మెయిన్ లీడ్ లో నటించిన జీబ్రా సినిమా నవంబర్ 22 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సత్యదేవ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి – చిరంజీవికి మధ్య జరిగిన ఓ ఆసక్తికర విషయం తెలిపారు.

Also Read : Shah Rukh Khan : ‘బాత్రూంలో కూర్చొని ఏడ్చిన షారుఖ్’ .. అసలేం జరిగిందంటే..?

సత్యదేవ్ మాట్లాడుతూ.. చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నీ సినిమాలన్నీ చూసాను, నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు నాకు తెలుసు. సత్య నీకు ఎప్పుడైనా ఏ బాధ వచ్చినా, కుంగిపోయినా ఒకటి గుర్తుపెట్టుకో అని చిరంజీవి గారు నా మొబైల్ తీసుకుని ఆయన నెంబర్ టైప్ చేసి ఏమని సేవ్ చేయను అంటే అన్నయ్య అని చెప్పాను అదే పేరుతో సేవ్ చేసి ఇచ్చారు. నీకు ఎప్పుడు ప్రాబ్లమ్ ఉన్నా నాకు ఫోన్ చెయ్యి నేను మాట్లాడతాను. నువ్వు మాత్రం ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకు. ఒలంపిక్స్ కోసం 5 ఏళ్ళు కష్టపడి పార్టిసిపేట్ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇంకో 5 ఏళ్ళ వరకు దాని కోసమే మళ్ళీ ప్రయత్నిస్తారు. మనం కూడా కుంగిపోకుండా మన బెస్ట్ ఇస్తూనే ఉండాలి అని చెప్పినట్టు తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇలా అందరికి సపోర్ట్ చేస్తారు ఇది కదా మెగా స్టార్ అంటే అని అభినందిస్తున్నారు.