Site icon 10TV Telugu

Satyadev – Vishwak Sen : జస్ట్ మిస్ సూపర్ హిట్ సినిమా.. సత్యదేవ్ చేయాల్సింది విశ్వక్ సేన్ కి వచ్చింది.. రాత్రికి రాత్రే డైరెక్టర్..

Satyadev Missed Super Hit Movie Chance Grabbed by Vishwak Sen

Satyadev - Vishwak Sen

Satyadev – Vishwak Sen : సినీ పరిశ్రమలో ఒకరి ఛాన్స్ ఇంకొకరికి పలు కారణాలతో వెళ్ళిపోతుందని తెలిసిందే. ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేస్తూ ఉంటారు చివరి నిషంలో. తాజాగా సత్యదేవ్ ఒక సినిమా మిస్ అయ్యాడని తెలిసింది. సత్యదేవ్ ఇటీవల అరేబియా కడలి సిరీస్ తో వచ్చాడు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యదేవ్ కి ఓ మీడియా ప్రతినిధి తనకు డైరెక్టర్ ఈ విషయం చెప్పాడని తెలిపాడు.

హిట్ సినిమా ఫ్రాంచైజ్ డైరెక్టర్ హిట్ 1 సినిమాని సత్యదేవ్ తో చేద్దాం అనుకున్నాడట. నైట్ టైం అనుకోని నెక్స్ట్ డే మార్నింగ్ సత్యదేవ్ కి కథ చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నాడట. అయితే ఆ రోజు రాత్రి సత్యదేవ్ చేసిన ఓ సినిమా ట్రైలర్ చూశాడట డైరెక్టర్ శైలేష్ కొలను. ఆ ట్రైలర్ లో సత్యదేవ్ పోలీస్ గా కనిపించాడట. దీంతో బ్యాక్ టు బ్యాక్ పోలీస్ అయితే తన సినిమా పాత్రకు ఇంపాక్ట్ ఉండదు అని సత్యదేవ్ ని వద్దనుకున్నాడట. ఆ తర్వాత అది విశ్వక్ వద్దకు వెళ్లి హిట్ ఫ్రాంచైజ్ లో మొదటి సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది.

Also See : Anupama Parameswaran : వైజాగ్ రోడ్లపై అనుపమ పరమేశ్వరన్.. ఫొటోలు..

అయితే డైరెక్టర్ శైలేష్ కొలను ఏదైతే ట్రైలర్ లో సత్యదేవ్ ని పోలీస్ గా చూసి వద్దనుకున్నాడో ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదట.

Exit mobile version