Satyadev speech in Kingdom PreRelease Event
తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథనాయిక. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సత్యదేవ్, వెంకటేష్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ.. హీరో విజయ్ దేవరకొండ పై ప్రశంసలు కురిపించాడు. అతడు విజయ్ దేవరకొండ కాదని, బంగారు కొండ అని కొనియాడాడు. ఒక్కొ మెట్టు ఎక్కుతూ అంచలంచెలుగా ఎదుగుతున్న విజయ్‌ను మనం కాపాడుకోవాలన్నారు.
Anirudh Ravichander : నేను మీ బక్కోడ్నే.. మా అందరి కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీ ఇది..
కింగ్‌డమ్ చిత్రంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. విజయ్‌ను తాను చాలా దగ్గరి నుంచి చూశానని, ఇతరుల గురించి ఎంతో కేర్ తీసుకుంటాడన్నారు. ఈ చిత్రం బ్లాక్‌బాస్టర్‌గా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఓ సామ్యాన్యుడిగా వచ్చి ఒక్కొ మెట్టు ఎక్కుతూ కింగ్‌డమ్‌ను స్థాపించుకున్న విజయ్ అంటే తనకు ఎంతో గౌరవం అని అన్నాడు.