Anirudh Ravichander : నేను మీ బక్కోడ్నే.. మా అందరి కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీ ఇది..
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Anirudh Ravichander speech in Kingdom Pre Release Event
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్ డమ్ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన భాగశ్రీ బోర్సే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో పాటు చిత్ర బృందం అంతా హాజరు అయింది.
ఈ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు అనిరుద్ తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్‌ను అలరించాడు. ఈ సినిమా రిలీజ్ కోసం తామంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. సినిమా ఔట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు. హీరో విజయ్ ఓ మంచి మనిషి అని, ఇతరుల యోగక్షేమాల గురించి ఆలోచిస్తారన్నారు.
Vijay Deverakonda : అందరూ కోరుకున్న విజయం ఖాయం.. : విజయ్ దేవరకొండ
ఇక తాను కింగ్‌డమ్ చిత్రాన్ని చూశానని అనిరుధ్ చెప్పాడు. అందరి కెరీర్‌లో ఓ మైలు స్టోన్ మూవీగా నిలుస్తుందన్నాడు. తెలుగు ప్రేక్షకుల కోసం ఓ కొత్త ప్రయత్నం చేశామన్నాడు. ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తానని నమ్ముతున్నట్లుగా చెప్పాడు. ‘నన్ను మీవాడిగా భావించి నాపై ప్రేమ కురిపిస్తున్నారు. మీ ప్రేమకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు నా వాళ్లు అయిపోయారు. ‘ అని అనిరుధ్ అన్నాడు.