Satyam Rajesh Megha Chowdhury Tenant movie is ready to release in april
Tenant : టాలీవుడ్ నటుడు సత్యం రాజేష్.. ‘పొలిమేర’ సినిమాలతో ఆడియన్స్ లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో ఈ నటుడు చేసే సినిమాల పై మంచి ఆసక్తి నెలకుంటుంది. పొలిమేర 2 రిలీజ్ సమయంలోనే ‘టెనెంట్’ అనే సస్పెన్స్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు ఆ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.
వై యుగంధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సత్యం రాజేష్, మేఘ చౌదరి భార్యాభర్తలుగా నటిస్తున్నారు. చందన పయావుల, భరత్ కాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భార్యని అనుమానంతో చంపేసిన భర్తగా సత్యం రాజేష్ క్యారెక్టర్ ని ట్రైలర్ లో చూపించారు. అయితే అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి అసలు ఆమెను చంపింది ఎవరు అనేది సినిమా రిలీజ్ అయిన తరువాతే తెలుసుకోవాలి. ఆల్రెడీ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
Also read : Tollywood New Movies : టాలీవుడ్ కొత్త సినిమాల స్టోరీ లైన్స్ చెబుతూ.. అమెజాన్ ప్రైమ్ పోస్టులు వైరల్..
ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ చిత్రాన్ని.. ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. పొలిమేర 2తో థ్రిల్ చేసిన సత్యం రాజేష్.. ఈ సినిమాతో కూడా థ్రిల్ చేస్తారేమో చూడాలి. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు.