Site icon 10TV Telugu

Tenant Review : సత్యం రాజేష్ ‘టెనెంట్’ రివ్యూ.. సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఆకట్టుకుందా..!

Satyam Rajesh suspense thriller movie Tenant review and rating

Satyam Rajesh suspense thriller movie Tenant review and rating

Tenant Review : ‘పొలిమేర 2’ వంటి మిస్టిక్ థ్రిల్లర్ తో సూపర్ హిట్ అందుకున్న సత్యం రాజేష్.. ఇప్పుడు ‘టెనెంట్’ అనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. సత్యం రాజేష్ తో పాటు మేఘ చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. వై యుగంధర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ అండ్ టీజర్స్ తో ఆడియన్స్ లో మంచి అంచనాలనే క్రియేట్ చేసుకుంది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంది..?

కథ విషయానికొస్తే..
గౌతమ్ (సత్యం రాజేష్), రిషి (భరత్ కాంత్) ఇద్దరి పక్కపక్క టెనెంట్స్ జీవితంలో జరిగే కథ. గౌతమ్ తన మరదలు సంధ్య (మేఘ చౌదరి) ని కొత్తగా పెళ్లి చేసుకొని తన ఫ్లాట్ కి తీసుకు వస్తాడు. ఇక రిషి ప్రేమించిన అమ్మాయి శ్రావణి (చందన పయావుల).. ఇంటిలో వాళ్ళు తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, హైదరాబాద్ రిషి ఫ్లాట్ కి పారిపోయి వచ్చేస్తుంది.

ఇలా నలుగురు ఒక దగ్గర చేరిన తరువాత, గౌతమ్ తన భార్యని చంపేస్తాడు. రిషి అపార్ట్మెంట్ నుంచి పడిపోయి చావు బ్రతుకుల మధ్య ఉంటాడు. అసలు గౌతమ్, సంధ్యని ఎందుకు చంపేశాడు..? రిషి ఎలా ప్రమాదానికి గురయ్యాడు..? అసలు శ్రావణి ఏమైంది..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also read : Mad Square : ‘టిల్లు స్క్వేర్’ అయిపోయింది.. నెక్స్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’.. మరో కామెడీ సీక్వెల్..

సినిమా విశ్లేషణ..
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కదా.. ఫస్ట్ హాఫ్ అంతా ప్రశ్నలు వేసి వదిలేసారు. ఇక ఆ ప్రశ్నలు అన్నిటికి.. సెకండ్ హాఫ్ లో జవాబులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా మరియు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కథ రివీల్ అవుతూ ముందుకు సాగుతుండడంతో ఇంటరెస్టింగా సాగుతుంది.

స్టోరీ పాయింట్ విషయానికి వస్తే.. దర్శకుడు ప్రస్తుత జీవితంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ని ఆధారంగా తీసుకోని రాసుకున్నట్లు తెలుస్తుంది. ప్రేమ కోసం ముందు వెనక ఆలోచించకుండా పారిపోయే అమ్మాయిలు, కొత్తగా పెళ్లి చేసుకొని సిటీకి వచ్చిన అమ్మాయి ఎదుర్కొనే సమస్యలను థ్రిల్లింగ్ చూపించే ప్రయత్నం చేసారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
సత్యం రాజేష్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు షేడ్స్ ఉన్న పాత్రని చాలా చక్కగా చేసారు. ఇక భరత్ కాంత్, మేఘ చౌదరి, చందన పయావుల కూడా తన పాత్రలకు తగ్గ న్యాయం చేసారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఎస్తేర్ నొరోన్హా కథని ముందుకు తీసుకు వెళ్తూ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో ఓకే అనిపించారు.

సాంకేతిక అంశాలు..
ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ చూపించాలని ట్రై చేసారు. అయితే అది కొంతవరుకే వర్క్ అవుట్ అయినట్లు కనిపించింది. సెకండ్ హాఫ్ ని మాత్రం బాగానే హ్యాండిల్ చేసారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ కి తగ్గట్టు మ్యూజిక్ ని సాహిత్య సాగర్ అందించారు. ఒక పాట బాగుంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా బాగున్నాయి. దర్శకుడిగా యుగంధర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

మొత్తంగా ‘టెనెంట్’ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఒక మెసేజ్ తో కూడా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

Exit mobile version