Sayaji Shinde Wants Pawan Kalyan Appointment he requests in Bigg Boss
Pawan Kalyan – Sayaji Shinde : తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన షాయాజీ షిండే ఇప్పుడు ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబు, షాయాజీ షిండే బిగ్ బాస్ కి వచ్చారు.
Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలు వీళ్ళే.. మొత్తం ఎనిమిది మంది.. అందరూ పాతోల్లే..
బిగ్ బాస్ స్టేజిపై సుధీర్ బాబు షాయాజీ షిండే గురించి మాట్లాడుతూ ఖాళీ ప్రదేశం కనిపిస్తే మొక్కలు నాటుతారని అన్నాడు. దీంతో నాగార్జున కారణం అడగ్గా షాయాజీ షిండే మాట్లాడుతూ.. మా అమ్మ చనిపోయే ముందు నా దగ్గర ఇంత డబ్బు ఉండి కూడా ఆమెను బతికించుకోలేకపోతున్నాను నేనేం చేయను అని ఆలోచించాను. అప్పుడు మా అమ్మ బరువుకు సమానమైన విత్తనాలు తీసుకొచ్చి ఇండియా మొత్తం నాటుతానని ఫిక్స్ అయ్యాను. అవి పెరిగి పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూస్తుంటే మా అమ్మ గుర్తొస్తుంది. సాధారణంగా ఆలయాలకు వెళ్తే ప్రసాదం ఇస్తారు. ప్రసాదంతో పాటు ఓ మొక్క కూడా ఇస్తే బాగుంటుంది. నేను మహారాష్ట్రలో ఆల్రెడీ మూడు ఆలయాల్లో ఇంప్లిమెంట్ చేశాను. అందరికి కాకపోయినా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించే వాళ్లకు ఇస్తారు. ఇక్కడ కూడా అది ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలు చెప్తాను. దేవుడు ప్రసాదంతో పాటు మొక్కలు కూడా పంచాలి. అవి తర్వాత జన్మలకు కూడా ఉంటాయి అని తెలిపారు.
A great initiative from #SayajiShinde garu 👏👏#PawanKalyan appointment akkarledu, vala fans eh akkadiki tesukeltaru – #Sudheerbabu #NagarjunaAkkineni 😌#BiggBossTelugu8 pic.twitter.com/9CuBIMMzBC
— Chaitanya (@PSPKArmys) October 6, 2024
దీంతో సుధీర్ బాబు, నాగార్జున.. మీరు ఇప్పుడు చెప్పారుగా ఈ మాటలను ఆయన ఫ్యాన్స్ ఆయన దగ్గరకు తీసుకెళ్తారు. మీ కోరిక నెరవేరుతుంది అని అన్నారు. దీంతో ప్రస్తుతం షాయాజీ షిండే వ్యాఖ్యలు వైరల్ అవ్వగా పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. మంచి ఆలోచన అని అంతా షాయాజీ షిండేని అభినందిస్తున్నారు.