Bigg Boss 8 : బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీలు వీళ్ళే.. మొత్తం ఎనిమిది మంది.. అందరూ పాతోల్లే..
ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా కొత్తగా మళ్ళీ 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. అయితే అందరూ పాతోల్లే కావడం గమనార్హం. వచ్చిన 8 మంది కూడా గత బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్నవాళ్ళే.

Bigg Boss Telugu Season 8 Wild Card Entry Contestants Details Here
Bigg Boss 8 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయిదు వారాలు ముగిసింది. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా కొత్తగా మళ్ళీ 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చారు. అయితే అందరూ పాతోల్లే కావడం గమనార్హం. వచ్చిన 8 మంది కూడా గత బిగ్ బాస్ సీజన్స్ లో పాల్గొన్నవాళ్ళే.
వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్ళే..
హరితేజ : యాంకర్, నటిగా గుర్తింపు తెచ్చుకున్న హరితేజ బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత షోలు, సినిమాలతో బాగానే బిజీ అయింది. ఇటీవలే దేవర సినిమాలో కూడా అలరించింది. తన మూడేళ్ళ కూతురిని వదిలేసి ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ లోకి రావడం గమనార్హం.
టేస్టీ తేజ : ఫుడ్ వ్లాగ్స్ తో బాగా పాపులర్ అయిన టేస్టీ తేజ బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొన్నాడు. ఇప్పుడు మళ్ళీ సీజన్ 8లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు.
నయని పావని : షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ తెచ్చుకున్న ఈ భామ గత సీజన్ లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఒక్క వారానికే వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ని రోజులు హౌస్ లో ఉంటుందో చూడాలి.
మెహబూబ్ : షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్సులతో పాపులారిటీ తెచ్చుకున్న మెహబూబ్ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పార్టిసిపేట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చాడు.
Also See : Bigg Boss Telugu Season 8 : అందుకే బయటకు వచ్చేశా..!
రోహిణి : సీరియల్స్, షోలు, సినిమాలతో లేడీ కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకుంది రోహిణి. గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న రోహిణి ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చింది.
గౌతమ్ కృష్ణ : నటుడిగా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ కృష్ణ గత సీజన్ లో పార్టిసిపేట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఈ సీజన్ లో వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చాడు. స్వతహాగా గౌతమ్ డాక్టర్ కావడం విశేషం.
అవినాష్ : జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఇప్పుడు షోలు, సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతంలో బిగ్ బోస్ సీజన్ 4 లో పాల్గొన్న అవినాష్ మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు.
గంగవ్వ : యూట్యూబ్ లో వీడియోలతో మెప్పించిన గంగవ్వ బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొని ఆరోగ్య సమస్యలతో బయటకు వచ్చేసింది. ప్రస్తుతం సినిమాలు, యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉన్న గంగవ్వ ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది.
మరి ఈ ఎనిమిది మందిలో ఎవరు ఫైనల్ దాకా ఆడతారు, ఎవరు మధ్యలో ఎలిమినేట్ అవుతారో చూడాలి.