Rachana : డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కోడలు.. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు పాప.. ఇన్నేళ్లకు మళ్ళీ మామయ్యతో కలిసి..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత(Samantha) ఫ్యామిలిలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటుంది. హోటల్ లో అందరూ కూర్చొని తినే సమయంలో గోదావరి భాషలో.. ఏంటి కూలెక్కలేదా వాటర్ అనే ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అయింది.

Seethamma Vakitlo Sirimalle Chettu Child Artist Rachana Meets Director Srikanth Addala
Rachana : డైరెక్టర్ గా శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala) మంచి మంచి సినిమాలనే అందించాడు. ఇటీవలే పెదకాపు సినిమాతో తన క్లాస్ మేకింగ్ ని దూరం పెట్టి మాస్ మేకింగ్ తో వచ్చి మెప్పించాడు. ఈ సినిమాలో దర్శకత్వంతో పాటు విలన్ గా కూడా చేయడం గమనార్హం. గతంలో మహేష్ బాబు – వెంకటేష్ లను పెట్టి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu) అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసి మంచి విజయం సాధించారు శ్రీకాంత్ అడ్డాల.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత(Samantha) ఫ్యామిలిలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటుంది. హోటల్ లో అందరూ కూర్చొని తినే సమయంలో గోదావరి భాషలో.. ఏంటి కూలెక్కలేదా వాటర్ అనే ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అయింది. సినిమాలోని పలు సీన్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపిస్తుంది. ఇటీవల రీల్స్ లో ఈ డైలాగ్ మళ్ళీ ఫేమస్ అవ్వడంతో ఆ అమ్మాయి గురించి అందరికి తెలిసి పాపులర్ అయింది.
అయితే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు రచన. ప్రస్తుతం రచన పెళ్లి చేసుకొని ఒక పాపతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. అలాగే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో స్టార్ కూడా అయిపోయింది. ఆర్టిస్ట్ గా ఛాన్సులు వస్తే చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతుంది రచన. సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్లు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ అమ్మాయికి మామయ్య వరుస అవుతారు.
ఆ సినిమా సమయంలో ఏదో ఫంక్షన్ లో రచన మాట్లాడే తీరు నచ్చి ఆమెని సినిమాలోకి తీసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల తన మామయ్య అని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఇన్నేళ్ల తర్వాత తన మామయ్యతో కలిసి ఫోటోలు దిగి షేర్ చేసింది. శ్రీకాంత్ అడ్డాలతో కలిసి దిగిన ఫోటోలని రచన తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మామ కోడలు మళ్ళీ కలిశారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి అప్పుడు ఛాన్స్ ఇచ్చినట్టే శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు కూడా తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి రచనకు బ్రేక్ ఇస్తాడేమో చూడాలి.