Sekhar Master : ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో డ్యాన్స్ తో పాటు కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయని తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ఎపిసోడ్ ప్రోమోలో శేఖర్ మాస్టర్, ఇంకో డ్యాన్స్ మాస్టర్ కూడా ఏడవడంతో ప్రోమో వైరల్ గా మారింది.
తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మధు అనే కంటెస్టెంట్ పక్కన డ్యాన్సర్లు తప్పు వేయడంతో మధ్యలో పర్ఫార్మెన్స్ ఆపేసారు. దీంతో శేఖర్ మాస్టర్ దీని గురించి మాట్లాడారు. ఆ పర్ఫార్మెన్స్ ని కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ స్టేజిపైకి వచ్చాక శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. మేము డ్యాన్సర్లు కదా. మాకు డ్యాన్స్ తప్ప వేరే ఏం రాదు. డ్యాన్స్ మిస్ అయితే మాస్టర్ ఎక్కడ వెళ్ళిపోతాడో, మాస్టర్ వెళ్ళిపోతే మాకు ఎక్కడ వర్క్ పోతుందో అని భయపడేవాళ్ళం అంటూ ఎమోషనల్ అయి ఏడ్చేశారు.
Also Read : Bangaru Bomma Song : ‘బంగారు బొమ్మ..’ ర్యాప్ సాంగ్ విన్నారా.. భలే ఉంది..
శేఖర్ మాస్టర్ మాటలకు అక్కడున్న కంటెస్టెంట్స్ కూడా ఎమోషనల్ అయ్యారు. ఆ పర్ఫార్మెన్స్ కంపోజ్ చేసిన డ్యాన్స్ మాస్టర్ కూడా స్టేజిపైనే ఏడ్చేశాడు. మరి శేఖర్ మాస్టర్ ఇంకేం మాట్లాడారో, ఎందుకు అలా ఏడ్చేసారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.