Bangaru Bomma Song : ‘బంగారు బొమ్మ..’ ర్యాప్ సాంగ్ విన్నారా.. భలే ఉంది..
తాజాగా బంగారు బొమ్మ రావేమి.. అనే పాత పాట లైన్ తీసుకొని దొంగతనం నేపథ్యంలో ఓ ర్యాప్ సాంగ్ రాశారు.

Bangaru Bomma Rap Song Released by Chandrabose
Bangaru Bomma Song : ఇటీవల ప్రైవేట్ ఆల్బమ్స్, అందులోను ర్యాప్ సాంగ్ బాగా వస్తున్నాయి. తాజాగా బంగారు బొమ్మ రావేమి.. అనే పాత పాట లైన్ తీసుకొని దొంగతనం నేపథ్యంలో ఓ ర్యాప్ సాంగ్ రాశారు. MC హరి, ప్రొజాక్‌లు ఈ పాటను రాసి స్వయంగా పాడారు. వేదం వంశీ సంగీత దర్శకత్వంలో ఈ పాటని కంపోజ్ చేసారు. ఈ క్రేజీ ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రణీత్ నెకురి నిర్మించారు.
ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది. పాత పాటని రీమిక్స్ చేసినట్టు, దానికి ఇంకొన్ని కొత్త లైన్లు చేర్చి ర్యాప్ సాంగ్ లా పాడటమే కాకుండా దొంగతనం విజువల్స్ తో చూపించారు. కెమెరా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. హైదరాబాద్ లో ఈ పాట షూటింగ్ చేసారు. పాట వింటే మీకు కూడా నచ్చేస్తుంది. మీరు కూడా ఈ బంగారు బొమ్మ ర్యాప్ సాంగ్ వినేయండి..
తాజాగా ఈ పాటని ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్ విడుదల చేశారు. పాటను రిలీజ్ చేసిన అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ.. బంగారు బొమ్మ ఇండిపెండెంట్ ఆల్బమ్‌ను MC హరి, ప్రొజాక్‌లు రాయడమే కాకుండా స్వయంగా పాడటం గొప్ప విషయం. ప్రస్తుతం ఇలాంటి ఇండిపెండెంట్ ఆల్బమ్స్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది. అమెరికాలో డాక్టర్ గా చేస్తున్న ప్రణీత్ కళ మీద ఆసక్తితో ఈ పాటని నిర్మించారు. ఈ పాటలో రెండు లేయర్స్ ఉన్నాయి. ఇదొక కొత్త ఆలోచన. ఇలాంటి ఆల్బమ్స్ మరెన్నో రావాలి. ఈ పాట మంచి సక్సెస్ అవ్వాలని తెలిపారు.
ఇక ఈ పాటకు సంబంధించిన పోస్టర్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ భవనంపై సందడి చేస్తోంది. అమెరికాలో కూడా ఈ బంగారు బొమ్మ ర్యాప్ సాంగ్ వైరల్ అవుతుంది.