Sekhar Master : స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని సినీ పరిశ్రమలలోని సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డ్యాన్స్ విషయంలో తను బాధపడిన ఓ సంఘటనను తెలిపారు.
ఇంటర్వ్యూలో లైఫ్ లో మీరు చేసిన సినిమాల విషయంలో, డ్యాన్స్ ల విషయంలో ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అలా చేయకుండా ఉండాల్సింది అని ఎప్పుడైనా అనుకున్నారా అని అడిగారు.
Also Read : Sekhar Master : ఆ విషయంలో నేను చాలా సఫర్ అయ్యా.. మాకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి..
దీనికి శేఖర్ మాస్టర్ సమాధానమిస్తూ.. ఆకాశమే నీ హద్దురా సినిమాకు నేను కొరియోగ్రాఫర్. చెన్నైలో షూట్. ఉదయం 6 గంటలకు అని చెప్పారు. 6 అంటే 7 దాటుతుందిలే అనుకున్నాను. ఆ ముందు రోజు కూడా వర్క్ చేసి కాస్త టైడ్ గా కూడా ఉన్నాను అయినా నేను 6.15 కే వెళ్లాను. అప్పటికే డైరెక్టర్ సుధా కొంగర, సూర్య సర్ వచ్చేసారు. అందరూ వచ్చేసారు, కెమెరా సెటప్ కూడా చేసేసారు. దాంతో చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా. స్టార్ హీరో, డైరెక్టర్ అందరూ ఎప్పుడో వచ్చి రెడీగా ఉన్నారు నేను మాత్రం 15 నిముషాలు లేట్ గా వెళ్లాను అని బాధపడ్డాను. ఇంకెప్పుడు అలా వెళ్ళకూడదు అనుకున్నా. అప్పట్నుంచి షూటింగ్ చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్తున్నా అని తెలిపారు.
Also Read : Yamudu : ‘యముడు’ కొత్త పోస్టర్ చూశారా..? మరో మైథాలజీ టచ్ ఉన్న సినిమా..