Yamudu : ‘యముడు’ కొత్త పోస్టర్ చూశారా..? మరో మైథాలజీ టచ్ ఉన్న సినిమా..
ఇప్పటికే యముడు సినిమా నుంచి గతంలో ఓ పోస్టర్ రాగా తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

Jagadeesh Amanchi Yamudu Movie Poster Released
Yamudu : గతంలో యముడికి రిలేటెడ్ గా చాలా సినిమాలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో యముడు పాత్రలతో సినిమా వచ్చి చాలా కాలం అయింది. త్వరలో యముడు అనే టైటిల్ తోనే సినిమా రాబోతుంది. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్ పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘యముడు’. ధర్మో రక్షతి రక్షితః అని ఉప శీర్షిక కూడా పెట్టారు. ఈ సినిమాలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read : Health Camp : ఫిలిం జర్నలిస్ట్ లకు ఉచిత కంటి పరీక్షలు.. ప్రియదర్శి, నాగ వంశీ గెస్టులుగా..
ఇప్పటికే యముడు సినిమా నుంచి గతంలో ఓ పోస్టర్ రాగా తాజాగా మరో పవర్ ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో యుముడి రూపంలో జగదీష్ భయపెడుతున్నాడు. యముడు, యముడి కాళ్ళ కింద యమపాశంతో కట్టి పడేసిన ఓ యువతి, వెనకాల యముడి వాహనం మహిషి, యముడి చేతికి సంకెళ్లు ఉండటంతో పోస్టర్ ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.
Also Read : Hello Baby : ‘హలో బేబీ’ మూవీ రివ్యూ..