Hello Baby : ‘హలో బేబీ’ మూవీ రివ్యూ..
సినిమా అంతా ఒకే ఇంట్లో, ఒకే క్యారెక్టర్ తో సాగుతుంది.

Kavya Keerthi Hello Baby Movie Review
Hello Baby Movie Review : కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా తెరకెక్కిన సినిమా హలొ బేబీ. ఈ సినిమా ఇటీవల ఏప్రిల్ 25న రిలీజయింది.
కథ విషయానికొస్తే.. సినిమా అంతా ఒకే ఇంట్లో, ఒకే క్యారెక్టర్ తో సాగుతుంది. ఆద్య(కావ్య కీర్తి) సాప్ట్ వేర్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటుంది బెంగళూరులో. వర్క్ చేస్తూ మధ్యలో వాళ్ళ అమ్మతో, ఫ్రెండ్ తో, కొలీగ్స్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆద్య కాలేజీ ఫ్రెండ్ రాహుల్ కాల్ చేస్తాడు. అప్పటి నుంచి ఆద్యకి సమస్య మొదలవుతుంది. ఇంట్లో ఆద్య ఏం చేస్తుందో, ఏ డ్రెస్ లో ఉందో అన్ని చెప్పి భయపెడుతూ ఉంటాడు. జాబ్ లో, వాళ్ళ అమ్మకు, తమ్ముడికి సమస్య వచ్చేలా చేస్తాడు రాహుల్. అసలు రాహుల్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు? ఆద్యకు వచ్చిన సమస్యలు ఏంటి? ఆద్య ఇంట్లో ఒక్కతే ఎందుకు ఉంది? ఆద్య తన సమస్యలను ఎలా సాల్వ్ చేసింది అనేది తెరపై చూడాల్సిందే.
Also Read : NC24: నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో NC24.. అంచనాలు పెంచేసిన స్పెషల్ వీడియో.. మీరు చూశారా..
సినిమా విశ్లేషణ.. ఇటీవల సింగిల్ క్యారెక్టర్ తో రెగ్యులర్ గా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ హలొ బేబీ కూడా అదే కోవలోకి చెందింది. సినిమా అంతా ఇంట్లో ఒక్కతే ఉండటం, కాల్స్ మాట్లాడటం, తనకు వచ్చిన సమస్యలు అన్ని ఆ కాల్స్ లోనే చెప్పడంతో కాస్త ఆసక్తిగానే సాగినా అక్కడక్కడా బోర్ కడుతుంది కూడా. ఆద్యకి సమస్య వచ్చినప్పుడల్లా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగేలా స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నారు.
నటీనటులు, సాంకేతిక అంశాలు.. సినిమా మొత్తం ఒకే క్యారెక్టర్. కీర్తి కావ్య సినిమా అంతా తనే ఉండటంతో అన్ని రకాల హావభావాలు పండించడంలో బాగానే సక్సెస్ అయింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఒకే ఇంట్లో కావడంతో డిఫరెంట్ కెమెరా షాట్స్ ప్రయత్నించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సస్పెన్స్ కూడా క్రియేట్ చేసారు. ఇలా సింగిల్ క్యారెక్టర్ తో కథ తీసుకొని ఆసక్తికర స్క్రీన్ ప్లేతో బాగానే రాసుకున్నారు డైరెక్టర్. నిర్మాణ పరంగా తక్కువ ఖర్చుతోనే సినిమాని బాగా తెరకెక్కించారు.
Also Read : Mahesh Babu On Wedding Card: ఇది కదా అభిమానం అంటే.. ఏకంగా పెళ్లి పత్రిక మీద మహేష్ బాబు ఫొటో..
మొత్తంగా హలో బేబీ సినిమా సింగిల్ క్యారెక్టర్ తో ఒకే ఇంట్లో తెరకెక్కించిన సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.