Sekhar Master : చిరంజీవి గ్రేట్ డ్యాన్సర్ అని అందరికి తెలిసిందే. టాలీవుడ్ లో డ్యాన్స్ లతో ఒక ట్రెండ్ సెట్ చేసిందే మెగాస్టార్. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా డ్యాన్స్ విషయంలో తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. ఇలా డ్యాన్స్ అదరగొట్టే హీరోలకు కంపోజ్ చేయడం అంటే కొరియోగ్రాఫర్స్ కి కష్టమే. అలాంటిది చిరంజీవి, చరణ్ లకు డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేయడం అంటే అదృష్టం అని భావిస్తారు డ్యాన్స్ మాస్టర్స్. విడివిడిగానే ఛాన్స్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది ఇద్దరికీ కలిపి డ్యాన్స్ కంపోజింగ్ అంటే మాములు విషయం కాదు.
చిరంజీవి – రామ్ చరణ్ ఇప్పటి వరకు మూడు సార్లు కలిసి డ్యాన్స్ చేసి అభిమానులను మెప్పించారు. మగధీర సినిమాలో బంగారు కోడిపెట్ట సాంగ్ కి, ఖైదీ నెంబర్ 150 సినిమాలో అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కి, ఆచార్య సినిమాలో బంజారా సాంగ్ కి చరణ్ – చిరంజీవి కలిసి డ్యాన్స్ చేసారు. ఇందులో రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కావడం గమనార్హం.
Also Read : Sekhar Master : సూర్య సర్ సినిమాకు 15 నిముషాలు లేట్.. చాలా బాధపడ్డాను..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ దీనిపై మాట్లాడుతూ.. ఏ కొరియోగ్రాఫర్ కి దక్కని అదృష్టం నాకే దక్కింది. చిరంజీవి సర్ – చరణ్ సర్ లతో పనిచేసే ఛాన్స్ రావడమే గొప్ప అవకాశం. అలాంటిది ఇద్దర్ని కలిపి డ్యాన్స్ చేయించే అవకాశం నాకు రెండు సార్లు వచ్చింది. ఖైదీ సినిమాలో అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్, ఆచార్య సినిమాలో బంజారా సాంగ్ రెండు నేనే కంపోజ్ చేశాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు సాంగ్ కి నాకు బాగా పేరొచ్చింది అని తెలిపారు.