Sekhar Master : మా అమ్మాయి పేరు చెప్పి మోసం చేస్తున్నారు.. నమ్మొద్దు అంటున్న శేఖర్ మాస్టర్..

మా అమ్మాయి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. అవి నమ్మి మోసపోవద్దు అంటూ శేఖర్ మాస్టర్ వీడియో.

Sekhar Master said some fake persons using his daughter name for Fraud

Sekhar Master : డాన్స్ మాస్టర్ శేఖర్ టాలీవుడ్ ఆడియన్స్ కి సుపరిచితుడే. టీవీ షోలు, స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే డాన్స్ నెంబర్స్ కోరియోగ్రఫీ చేస్తూ ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో శేఖర్ మాస్టర్ కి మంచి ఫేమ్ ఉంది. ఇక అయన వారసులు సాహితి, విన్నీ కూడా టీవీ ఛానల్స్ లో కనిపిస్తూ మంచి ఫేమ్ ని సంపాదించుకున్నారు. దీంతో వీరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే వీరికి ఉన్న క్రేజ్ ని కొంతమంది మోసం చేయడానికి వాడుకుంటున్నారు.

శేఖర్ మాస్టర్ కూతురు సాహితి పేరు మీద కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేసి.. పలువుర్ని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ కూతురు అని చెబుతూ.. మీ బ్రాండ్స్ ని నేను ప్రమోట్ చేస్తాను అంటూ ఆ ఫేక్ అకౌంట్స్ నుంచి మెసేజ్‌లు వెళ్తున్నాయట. ఆ ప్రమోషన్ కోసం డబ్బుని కూడా అడుగుతున్నారు. అవి నమ్మి డబ్బు పంపించిన తరువాత.. అసలు నిజం తెలుస్తుంది. ఇక ఈ విషయం శేఖర్ మాస్టర్ దగ్గర వరకు వెళ్లడంతో.. అయన ఒక వీడియో చేసి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Also read : Ram Charan : మెగా వెడ్డింగ్‌లో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా..?

మా అమ్మాయి పేరు చెప్పి మోసం చేస్తున్నారు. నా కూతురి పేరు మీద చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. మా అమ్మాయి అకౌంట్ లో నేను ఫాలోవర్ గా ఉంటాను. మిగిలిన ఏ అకౌంట్ లో నేను ఫాలోవర్ గా లేను. అది గుర్తించండి. ఫేక్ అకౌంట్స్ ని నమ్మి మోసపోవద్దు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.