Vijaya Rangaraju : సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత.. ఒకప్పుడు స్టార్ విలన్..

తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన నటుడు విజయ రంగరాజు మరణించారు.

Senior Actor Vijaya Rangaraju Passed Away after Accident in Movie Shooting

Vijaya Rangaraju : సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు, తెలుగు, తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో నటించిన నటుడు విజయ రంగరాజు మరణించారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో విజయ రంగరాజు గాయపడ్డారు. దాంతో ఆయనను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ నేడు ఉదయం కన్నుమూశారు. దీంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది.

తమిళనాడులో నాటకాలతో మొదలుపెట్టిన విజయ రంగరాజు మలయాళంలో వియాత్నం కాలనీ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన అసలు పేరు రామరాజు. అయితే ఒకప్పటి అగ్ర నిర్మాణ సంస్థ విజయ తమ బ్యానర్ పై వచ్చిన బాలకృష్ణ భైరవ ద్వీపం సినిమాలో ఈయనను విలన్ గా పరిచయం చేస్తుండటంతో విజయ రంగరాజు అని పేరు మార్చారు.

Also Read : Mahesh Babu – Rajamouli : మహేష్ – రాజమౌళి షూటింగ్ అప్డేట్.. బాలీవుడ్ హీరోతో షూట్..?

తెలుగు, తమిళ్, మలయాళంలో అనేక సినిమాల్లో నెగిటివ్ పాత్రల్లో నటించిన ఈయన గోపీచంద్ యజ్ఞం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గతంలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో సంచలన కామెంట్స్ చేసి వైరల్ అయ్యారు. ఈయన వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీలలో కూడా పాల్గొన్నారు. గత వారం రోజులుగా చెన్నైలోని హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ నేడు కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొనగా పలువురు తమిళ్, తెలుగు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.