Mahesh Babu – Rajamouli : మహేష్ – రాజమౌళి షూటింగ్ అప్డేట్.. బాలీవుడ్ హీరోతో షూట్..?

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి సినిమా..

Mahesh Babu – Rajamouli : మహేష్ – రాజమౌళి షూటింగ్ అప్డేట్.. బాలీవుడ్ హీరోతో షూట్..?

Mahesh Babu Rajamouli Movie SSMB 29 Shooting Happened with Bollywood Hero Details Here

Updated On : January 20, 2025 / 12:23 PM IST

Mahesh Babu – Rajamouli : మహేష్ బాబు – రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నాం అని చెప్పడం తప్ప ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకు రానివ్వట్లేదు. మూవీ యూనిట్ అధికారికంగా ఈ సినిమా గురించి చెప్పట్లేదు. ఇటీవల మూవీ ఓపెనింగ్ జరిగినా కూడా సీక్రెట్ గానే చేసారు. ఒక్క ఫోటో కానీ, ఒక్క వీడియో కానీ బయటకు రానివ్వలేదు.

SSMB29 సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ మాత్రం నిరాశ చెందుతున్నారు. కానీ లీకుల ద్వారా మాత్రం ఏదో ఒక వార్త ఈ సినిమా గురించి బయటకు వస్తూనే ఉంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి హైదరాబాద్ లోనే వేసిన సెట్ లో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల ప్రియాంక చోప్రా అమెరికా నుంచి హైదరాబాద్ రావడంతో రాజమౌళి మహేష్ సినిమాలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తుందని వార్తలకు మరింత బలం చేకూరింది.

Also Read : Kannappa : ‘కన్నప్ప’ నుంచి శివుడి ఫస్ట్ లుక్ రిలీజ్.. శివుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో..

తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా, బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంతో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. దీంతో ఈ సినిమాలో జాన్ అబ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి పాన్ ఇండియాతో పాటు హాలీవుడ్ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇండియానా జోన్స్ తరహాలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఇక్కడ సెట్స్ లో తీయాల్సిన షూటింగ్ అంతా చేసేసి అనంతరం కెన్యా అడవుల్లో షూటింగ్ చేస్తారని సమాచారం. ఇటీవల రాజమౌళి ఈ సినిమా కోసం కెన్యాలో లొకేషన్స్ వెతుకుతున్నట్టు ఓ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే.

Mahesh Babu Rajamouli Movie SSMB 29 Shooting Happened with Bollywood Hero Details Here

దీంతో ఈ సినిమాపై రోజురోజుకి మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా పూర్తవడానికి కనీసం మూడేళ్లు అయినా పడుతుందని వినిపిస్తుంది. మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ పార్టీలో పాల్గొనగా ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

Also Read : Razakar : ‘రజాకార్’ సినిమా ఆహా ఓటీటీలో ఎప్పట్నించి అంటే.. నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది?