Razakar : ‘రజాకార్’ సినిమా ఆహా ఓటీటీలో ఎప్పట్నించి అంటే.. నిజాం సంస్థానం భారతదేశంలో ఎలా విలీనమైంది?
ఇన్ని రోజుల తర్వాత రజాకార్ సినిమా ఓటీటీలోకి వస్తుంది.

Razakar Movie Streaming in Aha OTT Details Here
Razakar : హైదరాబాద్ నిజాం సంస్థానం భారదేశంలో ఎలా విలీనమైంది అనే కథతో తెరకెక్కిన సినిమా రజాకార్. గత సంవత్సరం మార్చ్ 1న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. యాట సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహ, అనసూయ, వేదిక, ప్రేమ, ఇంద్రజ, మకరంద దేశ్ పాండే, తేజ్ సప్రూ, రాజ్ అర్జున్, అనుశ్రీ.. ఇలా చాలా మంది స్టార్స్ నటించారు.
ఇన్ని రోజుల తర్వాత రజాకార్ సినిమా ఓటీటీలోకి వస్తుంది. రెగ్యులర్ గా తెలుగులో కొత్త కొత్త సినిమాలు, షోలు అందించే ఆహా ఓటీటీలోకి రజాకార్ సినిమా రానుంది. రజాకార్ల సినిమా ఆహా ఓటీటీలో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ మెంబర్స్ కి 48 గంటల ముందే స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు కచ్చితంగా ఓటీటీలో ఈ సినిమా చూసేయండి.
Also See : సుకుమార్ కూతురు సినిమా ‘గాంధీ తాత చెట్టు’ నుంచి సాంగ్ రిలీజ్..
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 500కి పైగా రాజసంస్థానాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశంలో విలీనం అయ్యేలా చేయగా హైదరాబాద్ నిజాం ప్రభుత్వం మాత్రం ప్రత్యేక దేశం కావాలని పట్టుబడింది. అలాంటి సమయంలో నిజాంల దగ్గరున్న రజాకార్లు ఏం చేసారు? నిజాం ప్రభుత్వంలో సామాన్య ప్రజలు పడ్డ ఇబ్బందులు ఏంటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం సంస్థానాన్ని భారతదేశంలో ఎలా కలిపారు అనే కథాంశంతో ఆసక్తిగా రజాకార్ సినిమాని తెరకెక్కించారు.