Manchu Vishnu : ‘కన్నప్ప’ షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు? తనికెళ్ళ భరణి డైరెక్ట్ చేయాల్సిన సినిమా..? మంచు విష్ణు ఏమన్నాడంటే..

మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ..

Manchu Vishnu : ‘కన్నప్ప’ షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు? తనికెళ్ళ భరణి డైరెక్ట్ చేయాల్సిన సినిమా..? మంచు విష్ణు ఏమన్నాడంటే..

Manchu Vishnu Tells about Interesting Facts on Kannappa Movie

Updated On : January 20, 2025 / 9:22 AM IST

Manchu Vishnu : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో కన్నప్ప(Kannappa) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్తూ వస్తున్నాడు. ఈ సినిమాని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు.

ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు మంచు విష్ణు. ఇప్పటికే చెన్నై, బెంగుళూరులో ప్రెస్ మీట్స్ పెట్టగా తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప గురించి ఆసక్తికర విషయాలు తెలియచేసారు. కన్నప్ప సినిమా ఆల్మోస్ట్ 90 శాతం షూటింగ్ న్యూజిలాండ్ లోనే చేసిన సంగతి తెలిసిందే. దాని గురించి, అక్కడ షూటింగ్ కి పడిన కష్టం గురించి తెలిపాడు.

Also Read : Aishwarya Rajesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమా ఏంటో తెలుసా?

మంచు విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది చాలా భారీ బడ్జెట్ సినిమా. 90 రోజులు కంటిన్యూగా న్యూజిలాండ్ లోనే షూటింగ్ చేసాము. ఇక్కడ్నుంచి 8 కంటైనర్లు మెటీరియల్ షిప్స్ ద్వారా న్యూజిలాండ్ కి పంపించాం. ఆల్మోస్ట్ 800 మందితో న్యూజిలాండ్ లో షూటింగ్ చేసాము. అది మాములు టాస్క్ కాదు. దేవుడు సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచంలో మనిషి ఇంకా నాశనం చేయని ప్లేస్ న్యూజిలాండ్. అందుకే అక్కడ షూటింగ్ చేస్తున్నాను. ఈ కథకు తగ్గట్టు అక్కడ లొకేషన్స్ ఉన్నాయి అని తెలిపారు.

manchu vishnu

అలాగే.. ప్రతి రోజు షూటింగ్ సమయానికి అయ్యేలాగే చూసుకున్నాము. అందరి సమయం, ఎనర్జీ, డబ్బులు సేవ్ చేయడానికే నేను ప్రయత్నించాను. ఈ సినిమా నాకు ఒక ఖరీదైన పాఠం. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 600 మంది సినిమా యూనిట్ ఉన్నారు. 197 మందిని సెట్ లో కొన్ని వర్క్స్ కి థాయిలాండ్ నుంచి రప్పించాము. ఆల్మోస్ట్ అందరం 5 నెలల పాటు కలిసి పనిచేసాము. కొన్ని సార్లు అక్కడ న్యూజిలాండ్ లోకల్ మావోరీ ప్రజలు కూడా మా షూట్ లో భాగమయ్యారు. వారి కల్చర్, మన కల్చర్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి అని తెలిపారు.

Also See : Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసులో ట్విస్ట్‌లే ట్విస్టులు.. నిందితుడు బంగ్లాదేశీ?

తనికెళ్ళ భరణి గురించి మాట్లాడుతూ.. నేను 1976లో వచ్చిన భక్త కన్నప్ప సినిమా చాలా సార్లు చూసాను. 2015లో తనికెళ్ళ భరణి గారు నాకు ఈ కథ చెప్పారు. అప్పట్నుంచి దీని మీద రీసెర్చ్ చేసి ఈ సినిమాని తీస్తున్నాను. నేను దీన్ని భారీ బడ్జెట్ లో గొప్పగా తీయాలనుకున్నాను. దాంతో తనికెళ్ళ భరణి గారు అంత భారీ స్థాయిలో చేయడం తనకు తగదు అని, చిన్న సినిమాలు చేయడమే ఇష్టం అని తప్పుకున్నారు. దాంతో నేను ఆ రైట్స్ కొనుక్కొని ముకేశ్ కుమార్ ని దర్శకుడిగా తీసుకొచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి హాలీవుడ్ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమా అంటే ఇష్టం. నా కథని లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫార్మేట్ ని జత చేసి చూపించాలి అనుకున్నాను అని తెలిపారు.

అలాగే ఈ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు, అందుకే అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్స్ ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అలాగే ఈ సినిమాలో మంచు కుటుంబం మూడు జనరేషన్స్ నటిస్తుందని తెలిపారు. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు విష్ణు కూతుళ్ళు, కొడుకు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఏ రేంజ్ హిట్ కొడతాడా చూడాలి.