Aishwarya Rajesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమా ఏంటో తెలుసా?
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి అమ్మాయి భాగ్యం పాత్రలో ఐశ్వర్య అదరగొట్టేసింది.

Do You Know about Aishwarya Rajesh Movie as Child Artist here Details
Aishwarya Rajesh : ఈ సంక్రాంతి పండుగకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ తో పాటు ఓ మెసేజ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ థియేటర్స్ లో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది ఈ సినిమా. ఇప్పటికే 161 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఫుల్ ప్రాఫిట్స్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ సినిమాలో వెంకటేష్ భార్య భాగ్యం పాత్రలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటించింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి అమ్మాయి భాగ్యం పాత్రలో ఐశ్వర్య అదరగొట్టేసింది. చాలా సహజంగా నటించి పెళ్ళైన గోదారి అమ్మాయి ఇలాగే ఉంటుంది కదా అనిపించేలా మెప్పించింది. దీంతో ఈమె నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్ మన తెలుగమ్మాయే. ఆమె తండ్రి రాజేష్ గతంలో నటుడిగా, హీరోగా అనేక సినిమాలు చేసారు. మేనేజర్ గా కూడా అనేక సినిమాలకు పనిచేసారు. హాస్య నటి శ్రీలక్ష్మి ఈమెకు అత్తయ్య అవుతుంది. ఐశ్వర్య రాజేష్ తండ్రి ఈమె చిన్నప్పుడే మరణించారు.
Also Read : Ram Charan : అభిమాని భార్యకు అపోలోలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించిన చరణ్.. బాలయ్య షోలో ఎమోషనల్ అయిన అభిమాని..
అయితే ఐశ్వర్య తెలుగులో కంటే తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్ గా, మెయిన్ లీడ్స్ లో తమిళ్ లో చాలానే సినిమాలు చేసింది. తెలుగులో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తుంది. కానీ వీటన్నిటికంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక తెలుగు సినిమాలో నటించింది.
ఐశ్వర్య రాజేష్ రాజేంద్రప్రసాద్ మెయిన్ లీడ్ లో తెరకెక్కించిన రాంబంటు సినిమాలో నటించింది. ఈ సినిమాలో ‘కప్పలు అప్పాలైపోవచ్చు.. సున్నం అన్నాలైపోవచ్చు..’ అని సాగే సాంగ్ లో ఐశ్వర్య వచ్చి రాజేంద్రప్రసాద్ కి ముద్దు పెట్టి స్టెప్పులు వేసి వెళ్ళిపోతుంది. ఈ చిన్న సీన్ కోసం అప్పుడు దాదాపు 15 టేకులు తీసుకుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఐశ్వర్య. చైల్డ్ ఆర్టిస్ట్ గా అదొక్కటే సినిమాలో నటించింది ఐశ్వర్య. తర్వాత హీరోయిన్ అయ్యాక కౌసల్య కృష్ణమూర్తి సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురిగా నటించింది ఐశ్వర్య రాజేష్.
Also Read : Producer Adityaram : పండక్కి 5000 మందికి సాయం చేసిన నిర్మాత..
ఐశ్వర్య తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్, రిపబ్లిక్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి మెప్పించింది. మరి ఈ సినిమా తర్వాత అయినా ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.