Ram Charan : అభిమాని భార్యకు అపోలోలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించిన చరణ్.. బాలయ్య షోలో ఎమోషనల్ అయిన అభిమాని..

రామ్ చరణ్ తనకు ఎంతగానో హెల్ప్ చేసాడని ఓ మెగా అభిమాని బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో తెలిపారు.

Ram Charan : అభిమాని భార్యకు అపోలోలో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించిన చరణ్.. బాలయ్య షోలో ఎమోషనల్ అయిన అభిమాని..

Ram Charan Helped for Free Treatment to Fans Wife Mega Fan Said in Balakrishna Unstoppable Show

Updated On : January 19, 2025 / 4:51 PM IST

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎంతోమంది అభిమానులకు, ప్రజలకు హెల్ప్ చేసిన సంగతి తెలిసిందే, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి సమయానికి రక్తం అందించడమే కాక అపోలో హాస్పిటల్ లో ఆపదలో ఉన్న తమ పేద అభిమానులకు అవసరమైన వారికి ఫ్రీగా చికిత్స అందిస్తూ ఉంటారు. బయట కూడా ఎంతోమంది అభిమానులకు అండగా ఉంటారు మెగా ఫ్యామిలీ. ఈ క్రమంలో రామ్ చరణ్ తనకు ఎంతగానో హెల్ప్ చేసాడని ఓ మెగా అభిమాని బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో తెలిపారు.

ఇటీవల రామ్ చరణ్ బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ షోలో చరణ్ బోలెడన్ని విషయాలు పంచుకున్నాడు. తన ఫ్యామిలీ, చిన్ననాటి సంగతులు, తన ఫ్రెండ్స్, గేమ్ ఛేంజర్ సినిమా.. ఇలా అనేక అంశాల గురించి మాట్లాడారు. అయితే బాలయ్య ప్రతి ఎపిసోడ్ చివర్లో మానవత్వం కాన్సెప్ట్ మీద ఎవరో ఒక వ్యక్తిని తీసుకొస్తారని తెలిసిందే. చరణ్ ఎపిసోడ్ కి మెగా అభిమాని అయిన మల్లేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొచ్చారు.

Also Read : Producer Adityaram : పండక్కి 5000 మందికి సాయం చేసిన నిర్మాత..

చిరంజీవి వీరాభిమాని అయిన మల్లేశ్వరరావు చిత్తూరు దగ్గర ఉన్న బంగారుపాళ్యం ఊరికి చెందిన వ్యక్తి. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేస్తారు. అయితే ఆయన భార్యకు ఓ ఆరోగ్య సమస్య రావడంతో ఆయన భయపడ్డాడు. తనకి ట్రీట్మెంట్ చేయించడానికి లక్షల్లో ఖర్చు అవుతుందని తెలిసి బాధపడటంతో ఈ విషయం మెగా అభిమానుల ద్వారా తెలుసుకున్న రామ్ చరణ్ ఆమెకు అపోలోలో ట్రీట్మెంట్ ఇప్పించాడు.

Ram Charan Helped for Free Treatment to Fans Wife Mega Fan Said in Balakrishna Unstoppable Show

ఈ విషయం మల్లేశ్వరరావు స్వయంగా అన్‌స్టాపబుల్ కి వచ్చి తెలిపారు. ఆయన భార్య గురించి తెలిసి ఇంటికి అంబులెన్స్ పంపించి అపోలోలో రూపాయి కూడా తీసుకోకుండా 17 రోజుల పాటు విఐపి ట్రీట్మెంట్ చేసారు అని, తన భార్య కోలుకుందని తెలిపారు. ఇది ఎవరు చేయించారు అని అపోలోలో అడిగితే చరణ్ బాబు చేయించినట్లు చెప్పారని తెలిపాడు. ఈ విషయం గుర్తుచేసుకుంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు. దీంతో మరోసారి చరణ్ మంచి మనసుని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. అలాగే అన్‌స్టాపబుల్ షో స్పాన్సర్స్ తరపున లక్ష రూపాయలు, యాభైవేల రూపాయలు చెక్ ని ఆయనకు అందించారు బాలయ్య.

Also Read : Fans Wars : సోషల్ మీడియాలో నెగిటివిటీ.. ఫ్యాన్ వార్స్ తో సినిమాని చంపేస్తున్న అభిమానులు..