Producer Adityaram : పండక్కి 5000 మందికి సాయం చేసిన నిర్మాత..
ఇటీవల సంక్రాంతి పండక్కి ఆదిత్యరామ్ చెన్నై ECR వద్ద ఉన్న తన ఆదిత్యరామ్ ప్యాలెస్ ముందు వేలాదిమంది పేదలకు, అనాథలకు సహాయం చేసారు.

Producer Adityaram Helped to 5000 Members on Sankranthi
Producer Adityaram : సినీ పరిశ్రమలో చాలా మంది సెలబ్రిటీలు సహాయ కార్యక్రమాలు చేయడంలో ముందుంటారని తెలిసిందే. తాజాగా ఓ నిర్మాత దాదాపు 5000 మందికి సంక్రాంతి పండక్కి నిత్యావసర వస్తువులు పంపిణి చేసారు. ఒకప్పుడు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన తమిళ నిర్మాత ఆదిత్య రామ్ ఆ తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పలు బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసారు. ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ తో మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
తమిళనాడులో గేమ్ ఛేంజర్ సినిమాని ఆదిత్య రామ్ రిలీజ్ చేశారు. ఇటీవల సంక్రాంతి పండక్కి ఆదిత్యరామ్ చెన్నై ECR వద్ద ఉన్న తన ఆదిత్యరామ్ ప్యాలెస్ ముందు వేలాదిమంది పేదలకు, అనాథలకు సహాయం చేసారు. దీనికి పణైయూర్, అక్కరై, ఉతండి, ఇంజంబాకం, శోలింగనల్లూరు.. లాంటి ప్రాంతాల్లోని ప్రజలతో ఆయన మమేకమై పండగ చేసుకున్నారు.
Also Read : Fans Wars : సోషల్ మీడియాలో నెగిటివిటీ.. ఫ్యాన్ వార్స్ తో సినిమాని చంపేస్తున్న అభిమానులు..
కులమత భేదాలు లేకుండా అక్కడికి వచ్చిన వారికి బియ్యం, పండగకు అవసరమైన పిండివంటల సరుకులు, మసాలా వస్తువులను ఆయన స్వయంగా పంపిణి చేసారు. దీంతో అక్కడికి వచ్చిన వారు సంతోషం వ్యక్తపరిచారు. పలువురు పెద్దలు ఆదిత్య రామ్ ని ఆశీర్వదించారు, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య రామ్ మాట్లాడుతూ.. నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి కష్టాలను ఎదుర్కొన్నాను. ఆ అనుభవం కారణంగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలని చూస్తాను. నా శక్తి మేరకు చివరి వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నారు.
ఆదిత్య రామ్ పేదలకు నిత్యవసరాల పంపిణి చేసిన వీడియోలు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.
Also Read : Naresh : మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్..