Naresh : మా అమ్మకు పద్మ అవార్డు ఇవ్వాలి.. సీనియర్ నటుడు నరేష్ కామెంట్స్..
తాజాగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లికి పద్మ అవార్డు ఇవ్వాలని, పద్మ అవార్డులపై కామెంట్స్ చేసాడు.

Senior Actor Naresh Comments on Padma Awards and Demands Padma Award for his Mother Vijaya Nirmala
Naresh : సీనియర్ నటుడు నరేష్ ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. నరేష్ తల్లి దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల గురించి అందరికి తెలిసిందే. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన విజయ నిర్మల దర్శకురాలిగా కూడా 40కి పైగా సినిమాలు తెరకెక్కించారు.
తాజాగా నరేష్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లికి పద్మ అవార్డు ఇవ్వాలని, పద్మ అవార్డులపై కామెంట్స్ చేసాడు.
Also Read : DVV Danayya : త్వరలోనే OG రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం.. తిరుమలలో పవన్ OG నిర్మాత..
నరేష్ మాట్లాడుతూ.. 46 సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయనిర్మల గారు. గతంలో నేను ఢిల్లీ స్థాయిలో అమ్మకు పద్మ అవార్డ్ కోసం ప్రయత్నించాను. కానీ అమ్మకు పద్మ అవార్డు రాలేదు. ఆవిడ పద్మ అవార్డ్ కోసం కేసిఆర్ గారు కూడా రికమెండ్ చేశారు. నేను ఏ గవర్నమెంట్ ను విమర్శించడం లేదు. బీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు ఇస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది. ఎంజీఆర్ గారు బ్రతికున్నప్పుడు పద్మ అవార్డు రాలేదు, సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు, మరణానంతరంగా అయిన పద్మ అవార్డు అమ్మకు ఇవ్వాలి. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ అర్హత కలిగిన వాళ్లు ఉన్నారు. మన వాళ్లకు పద్మ అవార్డులు వచ్చేందుకు ఆమరణ నిరాహారదీక్ష చేసినా తప్పులేదు. మళ్లీ ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తాను అని అన్నారు.
దీంతో నరేష్ వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చగా మారాయి. మరి ఈ సంవత్సరం విజయ నిర్మల పేరు పద్మ అవార్డుకు సిఫార్సు చేస్తారా? సినీ పరిశ్రమ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎవర్నైనా సిఫార్సు చేస్తాయా చూడాలి.