Thaman – Prabhas : ప్రభాస్ సినిమా నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసిన తమన్.. తమన్ – ప్రభాస్ ఫస్ట్ సినిమా అదే అవ్వాలి.. కానీ..

ఏదైనా సినిమా మధ్యలోంచి వెళ్లిపోయారా అని అడగ్గా తమన్ డైరెక్ట్ గానే సమాధానం చెప్పాడు.

Thaman – Prabhas : ప్రభాస్ సినిమా నుంచి మధ్యలోనే బయటకు వచ్చేసిన తమన్.. తమన్ – ప్రభాస్ ఫస్ట్ సినిమా అదే అవ్వాలి.. కానీ..

Music Director Thaman Came Out from Prabhas Rebel Movie

Updated On : January 19, 2025 / 12:37 PM IST

Thaman – Prabhas : తమన్ ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా అయినా సంగీత దర్శకుడిగా ఆల్మోస్ట్ తమనే ఉంటున్నాడు. 2009 లో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన తమన్ గతంలో చాలా హిట్స్ ఇచ్చినా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, సింగింగ్ షోలకు జడ్జ్ గా.. ఫుల్ బిజీగా ఉన్నాడు తమన్.

ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ రెండు సినిమాలలోని మంచి మ్యూజిక్ ఇచ్చి మెప్పించాడు. తాజాగా ఓ సింగర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ఏదైనా సినిమా మధ్యలోంచి వెళ్లిపోయారా అని అడగ్గా తమన్ డైరెక్ట్ గానే సమాధానం చెప్పాడు.

Also Read : Anil Raviudi : డైరెక్టర్ అనిల్ రావిపూడి సాధించిన రికార్డ్స్ తెలుసా? 8 హిట్ సినిమాలతో..

తమన్ సమాధానమిస్తూ.. ప్రభాస్ రెబల్ సినిమా మధ్యలో నుంచి తప్పుకున్నాను. ఆ సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు, పని కూడా మొదలైంది. ప్రభాస్ తో నాకు అదే ఫస్ట్ సినిమా కావడంతో ది బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను కానీ మధ్యలోనే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను అని తెలిపారు. అయితే 2012 ఆ సినిమా సమయంలో రెబల్ దర్శకుడు రాఘవ లారెన్స్ కి, తమన్ కి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే తమన్ తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి. తమన్ తప్పుకున్నాక ఆ సినిమాకు రాఘవ లారెన్స్, సింగర్ చిన్ని సంగీత దర్శకత్వం చేసారు.

రెబల్ సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ ఎలివేషన్స్ అన్ని బాగానే ఉంటాయి. ప్రభాస్ కి ఈ సినిమాలో అదిరిపోయే ఎలివేషన్స్ ఉంటాయి. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. తమన్ రెబల్ సినిమా నుంచి తప్పుకున్నాక మళ్ళీ రాధేశ్యామ్ తో ప్రభాస్ సినిమాకు పనిచేసాడు. ప్రభాస్ – తమన్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా పాటలు బాగున్నా పరాజయం పాలైంది. ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాకు వర్క్ చేస్తున్నాడు తమన్.

తాజాగా తమన్ సోషల్ మీడియా నెగిటివిటి గురించి మాట్లాడి వార్తల్లో నిలిచారు. డాకు మహారాజ్ సినిమా సక్సెస్ ఈవెంట్లో తమన్ గేమ్ ఛేంజర్ సినిమాపై చేసిన నెగిటివిటి గురించి మాట్లాడుతూ, సినిమాని చంపకండి, ఫ్యాన్స్ మీరు మీరు కొట్టుకోండి కానీ సినిమాని వదిలేయండి, నిర్మాతలు ఈ ట్రోల్స్ చూసి భయపడుతున్నారు, నిర్మాతలకు చాలా నష్టం జరుగుతుంది అంటూ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : Sankranthiki Vasthunnam Collections : ‘సంక్రాంతికి వస్తున్నాం’ అయిదు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు.. బాలయ్య సినిమాని దాటేసిందిగా..