Krishnaveni : సీనియర్ ఎన్టీఆర్ ని నటుడిగా పరిచయం చేసిన సీనియర్ నటి, నిర్మాత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి కన్నుమూశారు. కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాలనటిగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు.
Also Read : CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత కాలం ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది : సీఎం చంద్రబాబు
నటిగా మారి హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న సమయంలో కృష్ణవేణికి మీర్జాపురం రాజా వారితో పరిచయం అయి ప్రేమగా మారి అప్పట్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1949లో ‘మనదేశం’ అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు కృష్ణవేణి.
Also Read : Ranveer Allahbadia : రణవీర్ అల్లాబాడియా ఎక్కడ? ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరార్.. గాలిస్తున్న ముంబై పోలీసులు..!
ఈమెకు ప్రస్తుతం 101 సంవత్సరాలు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఈ రోజు ఉదయం ఆమె తుది స్వాస విడిచినట్లు ఆమె కూతురు అనురాధ తెలిపారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమతి కృష్ణవేణిని రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. ఎన్టీఆర్ వజ్రోత్సవం సందర్భంగా గత సంవత్సరం డిసెంబర్ 14న విజయవాడలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు శ్రీమతి కృష్ణవేణిని సత్కరించారు.