Ranveer Allahbadia : రణవీర్ అల్లాబాడియా ఎక్కడ? ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరార్.. గాలిస్తున్న ముంబై పోలీసులు..!
Ranveer Allahbadia : ఫిబ్రవరి 15న ముంబై పోలీసులు పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అతని జాడ కనుక్కోలేకపోయారు. అయితే, హాస్యనటుడు సమయ్‌కి సమాచారం ఇచ్చారు.

Ranveer Allahbadia
Ranveer Allahbadia : నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది అంటారు.. ఈ సామెత సరిగ్గా ఈ రణవీర్ అల్లాబాడియాకు సరిపోతుంది. నోట దూలతో చిక్కుల్లో పడ్డాడు. ఎంత పాపులర్ పోడ్ కాస్టర్, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయినా చివరికి ఒక దొంగలా దాక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి జాడ కనిపెట్టేందుకు ముంబై పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. హాస్యనటులు సమయ్ రైనాతో చేసిన షోలో తల్లిదండ్రుల సంబంధం గురించి అసభ్యకరమైన ప్రశ్న అడగడంతో తీవ్ర వివాదాస్పదమైంది. దేశవ్యాప్తంగా రణవీర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మార్చి 10లోగా విచారణకు రావాలి :
ఇప్పుడు ముంబై పోలీసుల ప్రకారం.. ఆ యూట్యూబర్ కనిపించడం లేదు. అతను ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియదు. నిజానికి, రణవీర్ అలహాబాడియా అడిగిన ప్రశ్నకు అందరూ ఆశ్చర్యపోయారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ మరికొందరు ప్రముఖులు సోషల్ మీడియాలో అతనిని అన్‌ఫాలో చేశారు. మరికొందరు అతని పాడ్‌కాస్ట్ సబ్‌స్ర్కిప్షన్ క్యాన్సిల్ చేసుకున్నారు. అనేక నిరసనల తర్వాత ఆ షోలో కనిపించిన వారందరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందరికీ సమన్లుకూడా పంపారు.
అపూర్వ మఖిజా, ఆశిష్ చంచ్లానీ ఇతరులు కూడా తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. కానీ, రణవీర్ విచారణకు హాజరు కాలేదు. ముంబై పోలీసులు పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో అతని జాడ కనుక్కోలేకపోయారు. అయితే హాస్యనటుడు సమయ్ రైనా తన యూట్యూబ్ షోలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై విచారణకు హాజరు కావడానికి మార్చి 10 వరకు సమయం ఇచ్చారని ఒక అధికారి తెలిపారు.
తల్లిదండ్రుల శృంగారంపై అసభ్యకర వ్యాఖ్యలు :
ప్రస్తుతం తొలగించిన యూట్యూబ్ షో ఇండియాస్ గాట్ లాటెంట్‌లో తల్లిదండ్రుల శృంగారం గురించి అల్లాబాడియా చేసిన దారుణమైన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనితో అనేక మంది నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
యూట్యూబ్‌లో ‘బీర్‌బైసెప్స్’ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన అల్లాబాడియా ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఖార్ పోలీసులు అతన్ని సంప్రదించలేకపోయారని అధికారి తెలిపారు. తన క్లయింట్ అమెరికాలో ఉన్నారని పేర్కొంటూ రైనా న్యాయవాది మరింత సమయం కోరుతూ సీనియర్ పోలీసు అధికారులను కలిశారని అన్నారు.
న్యాయవాది అభ్యర్థన మేరకు, పోలీసులు మార్చి 10 వరకు తమ ముందు హాజరు కావాలని, స్టేట్‌మెంట్ నమోదు చేసుకోవాలని అతనికి సమయం ఇచ్చారు. తన నివాసంలో తన స్టేట్‌మెంట్ నమోదు చేయాలని అల్లాబాడియా గతంలో ఖార్ పోలీసులను అభ్యర్థించారు. కానీ, అతని అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారు.
పోలీసులు శుక్రవారం వెర్సోవా ప్రాంతంలోని అతని ఫ్లాట్‌కు వెళ్లారు. కానీ, అక్కడ తాళం వేసి ఉందని గుర్తించారు. బీజేపీ కార్యకర్త దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు మఖిజా, చంచలానీ, అల్లాబాడియా మేనేజర్‌తో సహా 8 మంది వ్యక్తుల స్టేట్‌మెంట్‌లను నమోదు చేశారు.
Read Also : Russian Beer : బీర్ బాటిల్ మీద గాంధీ తాత ఫొటో.. కంపెనీని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తున్న నెటిజన్లు..!
అయితే, ఈ విషయంలో నగర పోలీసులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ కేసులో మహారాష్ట్ర సైబర్ నమోదు చేసిన కేసుకు సంబంధించి కనీసం 50 మంది వ్యక్తులకు వారి వాంగ్మూలాలను నమోదు చేసేందుకు సమన్లుజారీ చేసింది. వారిలో షోలో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. నటుడు, సినీ ప్రముఖుడు రఘు రామ్ ఏజెన్సీతో తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆయన రైనా షో న్యాయనిర్ణేతల ప్యానెల్‌లో ఉన్నారు.
అన్ని వీడియోలను డిలీట్ చేసిన సమయ్ రైనా :
మహారాష్ట్ర సైబర్ సెల్ రణవీర్, సమయ్ ‘ఇండియాస్ గాట్ లాటెంట్’తో సంబంధం ఉన్న ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ తరువాత రణ్‌వీర్ కూడా క్షమాపణలు చెప్పాడు. అదే సమయంలో, సమయ్ రైనా కూడా ఆ గొడవతో విసిగిపోయి అన్ని వీడియోలను తొలగించాడు.