iPhone 15 VS iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 15 బెటరా? ఐఫోన్ 16 కొంటే బెటరా? మీకు ఏ ఐఫోన్ బెస్ట్ అంటే? ఫుల్ డిటెయిల్స్..!
iPhone 15 VS iPhone 16 : ఐఫోన్ కోసం చూస్తున్నారా? మార్కెట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 16 రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లలో ఏది కొంటే బెటర్ అంటే.. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ చదివేయండి.

Apple iPhone 15 VS Apple iPhone 16
iPhone 15 VS iPhone 16 : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏ ఐఫోన్ మోడల్ కొనాలో అర్థం కావడం లేదా? మీరు కూడా కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇది మీకోసమే.. ఐఫోన్ మోడల్స్ అనేకం మార్కెట్లో ఉన్నాయి. బ్రాండ్ పరంగా చూసుకుంటే ఏ ఐఫోన్ అయినా మంచిదే. కానీ, స్పెషిఫికేషన్లు, ధరల వారీగా పరిశీలిస్తే మాత్రం ఏది బెటర్ అంటే తప్పక చెక్ చేసుకోవాలి కదా. ఐఫోన్ అనగానే ప్రతిఒక్కరూ ముందుగా ఫీచర్లు, స్పెషిఫికేషన్లను చెక్ చేస్తారు.
అందులో మీరు ఐఫోన్ 15 లేదా ఐఫోన్ 16 కొనాలని అనుకుంటే.. ఈ రెండింటిలో ఏది బెటర్ అంటే.. కొన్ని విషయాల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.. ఈ రెండు మోడళ్లు ప్రీమియం ఫీచర్లను అందిస్తున్నాయి. కొనుగోలు చేసే ముందు కొన్ని తేడాలను గమనించాలి.
ఐఫోన్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌టైమ్ పరంగా ఐఫోన్ 16 ఐఫోన్ 15 కన్నా అప్‌గ్రేడ్ మోడల్ కదా.. కెమెరా, డిస్‌ప్లే కూడా ఒకటే.. కానీ, ర్యామ్, ప్రాసెసింగ్ పవర్ కొంచెం అప్‌గ్రేడ్ అయ్యాయి అంతే.. ఈ తేడాలను కనిపెట్టాలంటే ఆపిల్ ఐఫోన్ 15, ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్‌లను ఓసారి కంపేర్ చేసి చూడాల్సిందే..
ఐఫోన్ 15 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 15 మోడల్‌లో A16 బయోనిక్ హెక్సా కోర్ ప్రాసెసర్ డ్రైవ్‌లు ఉన్నాయి. ఈ ఐఫోన్ ఎంతో పవర్‌ఫుల్ కూడా. 60Hz వద్ద రన్ అయ్యే 6.1-అంగుళాల సూపర్ రెటినా (XDR) డిస్‌ప్లే నుంచి ప్రతిదీ సూపర్ అని చెప్పవచ్చు. స్క్రీన్ అద్భుతంగా ఉంది. కలర్ విషయంలోనే కొంచెం తేడా. ఐఫోన్ బ్యాక్ సైడ్ 48MP+12MP రిజల్యూషన్ డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ సైడ్ అమర్చిన కెమెరా 12MP సెన్సార్‌తో సెల్ఫీలు తీసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 15 బ్యాటరీ సాధారణ సామర్థ్యం 3349mAh, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును అందిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మీ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ అయ్యేందుకు ఇది చాలా అవసరం. ర్యామ్ విషయానికి వస్తే.. 6GB ఆప్షన్, 128GB స్టాండర్డ్ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. iOS17 అనేది ఆపరేటింగ్ సిస్టమ్. వేగంగా ఆపరేట్ చేయొచ్చు. భద్రతపరంగా యూజర్ ఫ్రెండ్లీగా ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 ధర బేస్ వేరియంట్‌కు రూ. 61,499 నుంచి ప్రారంభమై 512GB స్టోరేజీతో హై ఎండ్ మోడల్‌కు రూ. 93,999 వరకు పెరుగుతుంది.
ఆపిల్ ఐఫోన్ 16 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 కూడా ఆపిల్ A18 హెక్సా కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది. స్పీడ్ పరంగా చాలా బెటర్ అని చెప్పవచ్చు. మల్టీ టాస్కింగ్ కోసం ఐఫోన్ 16 గత వెర్షన్ కన్నా అద్భుతంగా ఉంటుంది. 60Hz సూపర్ రెటినా XDR ప్యానెల్ మారదు.
సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరాతో బ్యాక్ డ్యూయల్ 48MP + 12MP కెమెరాలు కూడా మారవు. అన్ని ఒకేలా ఉంటాయి. ఐఫోన్ 16 కొంచెం పెద్ద 3561mAh బ్యాటరీతో వస్తుంది. అదే 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. మెరుగైన సామర్థ్యం, అప్లికేషన్ రన్ చేసేందుకు 8GB ర్యామ్‌కి పెంచారు.
Read Also : Car Loan : కారు లోన్ తీసుకుంటున్నారా? ఈ సింపుల్ ఫార్ములాను పాటిస్తే చాలు.. భవిష్యత్తులో ఈఎంఐ కష్టాలే ఉండవు!
ఈ ఫోన్ iOS18లో రన్ అవుతుంది. కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు, అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది. బేస్ మోడల్ ధర రూ. 69,999గా ఉంటే.. 512GB ఎడిషన్ ధర రూ. 109,900 వరకు పలుకుతోంది. ఇక డిస్‌ప్లే, కెమెరాలు ఒకేలా పోలి ఉంటాయి.
కానీ, ఐఫోన్ 16 మెరుగైన ర్యామ్, బ్యాటరీ, ప్రాసెసర్‌ను అందిస్తుంది. మీరు మెరుగైన సామర్థ్యాన్ని కోరుకుంటే ఐఫోన్ 16 బెస్ట్ ఆప్షన్. కానీ, మీరు కొంత డబ్బు ఆదా చేయాలనుకుంటే మాత్రం ఐఫోన్ 15 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఫీచర్ల పరంగా ఐఫోన్ 16 కొనేసుకోవచ్చు. ఫీచర్లు అక్కర్లేదు.. తక్కువ ధరకే వస్తుంది కదా అంటే ఐఫోన్ 15 కొనేసుకోవచ్చు.