Car Loan : కారు లోన్ తీసుకుంటున్నారా? ఈ సింపుల్ ఫార్ములాను పాటిస్తే చాలు.. భవిష్యత్తులో ఈఎంఐ కష్టాలే ఉండవు!
Car Loan Tips : కారు లోన్ తీసుకుంటున్నారు సరే.. ప్రతినెలా ఈఎంఐ గురించి ఆలోచించారా? ప్రతి నెలా బ్యాంకుకు ఈఎంఐ చెల్లించాలి కదా.. మీరు కారు లోన్ తీసుకునే ముందు ఈ ఫార్ములా గురించి తెలుసుకోవాలి.

Car Loan Tips
Car Loan EMI Calculator : కారు లోన్ తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఒక్క క్షణం ఆలోచించండి.. దాదాపు ప్రతి ఒక్కరూ సొంత కారు కొనాలని కలలు కంటారు. కానీ, కారు ధరను పరిగణనలోకి తీసుకుంటే అందరూ కారు కొనలేరు. మధ్యతరగతి వ్యక్తికి కారు కొనడం చాలా పెద్ద విషయం. చాలా మంది కారు కొనడానికి (Car Loan Formula) బ్యాంకు నుంచి కారు లోన్ కూడా తీసుకుంటారు.
ఇలాంటి పరిస్థితిలో, మీరు కూడా కారు కొనాలనుకుంటే ఇందుకోసం బ్యాంకు నుంచి కారు రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవడం ఎంతైనా మంచిది. లేదంటే ఆ తర్వాత బాధపడిన లాభం ఉండదు. కారు లోన్ తీసుకునే ముందు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోండి. లేదంటే భవిష్యత్తులో ఈఎంఐ చట్రంలో పడి నలిగిపోతారు.
కారు లోన్‌కు ఈ ఫార్ములా తప్పనిసరి :
ప్రస్తుత రోజుల్లో చాలామంది బ్యాంకు నుంచి కారు రుణం తీసుకుంటుంటారు. అయితే, మీకు తక్కువ డబ్బుకు కారు లభిస్తుంది. కానీ, మీరు ప్రతి నెలా బ్యాంకుకు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు కారు లోన్ తీసుకునే ముందు కొన్ని ముఖ్య విషయాలపై అవగాహన పెంచుకోవాలి.
మీరు 20/4/10 ఫార్ములా గురించి తప్పక తెలుసుకోవాలి. మీరు ఈ ఫార్ములాను అప్లయ్ చేశారంటే చాలు.. భవిష్యత్తులో మీకు ఈఎంఐ చెల్లింపుల సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. ఇంతకీ 20/4/10 ఫార్ములా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అసలు 20/4/10 ఫార్ములా ఏంటి? :
20/4/10 ఫార్ములా ప్రకారం.. కారు రుణం తీసుకునే ముందు మీరు 3 విషయాలను బాగా తెలుసుకోవాలి. అవేంటో అర్థం చేసుకోవాలి. ఇందులో కార్ లోన్ ఈఎంఐ, కార్ లోన్ కాలపరిమితి, కార్ లోన్ డౌన్ పేమెంట్ అనేవి ఉంటాయి. 20/4/10 ఫార్ములాలో 20 కన్నా 20 శాతం డౌన్ పేమెంట్ తప్పనిసరి.
Read Also : 8th Pay Commission : ఉద్యోగుల జీతాలు పెరిగే డేట్ ఇదేనా? ఎంత పెరగొచ్చు? ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
కారు లోన్ తీసుకునే సమయంలో మీరు 20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాలి. 20/4/10 సూత్రంలో 4 అంటే 4 సంవత్సరాల కాలం. దీని అర్థం.. మీరు కారు రుణ కాలపరిమితిని 4 సంవత్సరాలకు మించి పొడిగించకూడదు.
ఈ ఫార్ములాలో 10 అంటే.. మీ జీతంలో 10 శాతం అనమాట. మీ లోన్ నెలవారీ ఈఎంఐ కూడా మీ జీతంలో 10 శాతానికి మించకూడదు. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో కారు లోన్ ఎలాంటి చీకు చింతా లేకుండా హాయిగా ఈఎంఐలు కట్టుకోవచ్చు..