Russian Beer : బీర్ బాటిల్ మీద గాంధీ తాత ఫొటో.. కంపెనీని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తున్న నెటిజన్లు..!

Russian Beer : రష్యన్ బీర్ బ్రాండ్, రివర్ట్ బీర్ టిన్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ఉపయోగించుకున్నందుకు భారతీయ నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Russian Beer : బీర్ బాటిల్ మీద గాంధీ తాత ఫొటో.. కంపెనీని లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్తున్న నెటిజన్లు..!

Russian beer featuring Mahatma Gandhi

Updated On : February 15, 2025 / 10:07 PM IST

Russian Beer : మన భారత జాతిపితకు అవమానం.. శాంతిమార్గాన్ని బోధించిన గాంధీ తాతను ఇలా వ్యంగ్యంగా చిత్రీకరించడం సహించరానిది. మన దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్ముడిగా పేరొందిన గాంధీ తన లైఫ్ మొత్తం మద్యాన్ని ముట్టలేదు.

దేశప్రజలను అలాగే ఉండాలని సూచించారు. మన జాతిపిత బొమ్మ భారతీయ కరెన్సీపై ఉంచి ఆయన పట్ల గౌరవభావాన్ని చూపిస్తున్నాం. అలాంటి మహత్ముడి చిత్రపటాన్ని ఒక బీర్ బాటిల్‌పై చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Read Also : iPhone 15 VS iPhone 16 : ఆపిల్ ఐఫోన్ 15 బెటరా? ఐఫోన్ 16 కొంటే బెటరా? మీకు ఏ ఐఫోన్ బెస్ట్ అంటే? ఫుల్ డిటెయిల్స్..!

ఎన్నో దేశాలు గాంధీజీ సిద్ధాంతాలను గొప్పగా అభివర్ణించే ఆయన చిత్రపటం ఇలా కనిపించడం ఎందరినో బాధించింది. గాంధీజీ ఫొటోతోపాటు ఆటోగ్రాఫ్‌ను కూడా బీర్ డబ్బాలను ముద్రించింది. ఈ బాటిల్‌ను REWORT అనే లిక్కర్ బ్రాండ్ కంపెనీ తయారు చేసినట్లు కనిపిస్తోంది. వ్యంగ్యమా లేక అవమానమా? రష్యన్ బీర్ బ్రాండ్ రివర్ట్ తన ప్యాకేజింగ్‌పై మహాత్మా గాంధీ చిత్రాన్ని ముద్రించడం వివాదానికి దారితీసింది.

ఈ ఆల్కహాల్ కంపెనీ ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో భారతీయ నెటిజన్లలో ఆగ్రహానికి దారితీసింది. సామాజిక కార్యకర్త సుపర్ణో సత్పతి ఈ బీరు ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభ్యర్థించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా దీనిపై చర్చించాలని ప్రధానిని కోరారు.

ఈ పోస్టుపై చాలా మంది భారతీయ నెటిజన్లు స్పందిస్తూ ఈ దారుణమైన చిత్రీకరణపై ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, భారత గౌరవనీయ నేతను అగౌరవపరిచినందుకు బ్రాండ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వాణిజ్య ప్రయోజనాల కోసం గాంధీ చిత్రాన్ని దుర్వినియోగం చేయడంపై నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భారత ప్రభుత్వాన్ని రష్యన్ అధికారులతో వీలైనంత త్వరగా చర్చించాలని, మరికొందరు బ్రాండ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

“షాకింగ్ చర్య.. ఇది ఆమోదయోగ్యం కాదు. రష్యన్ బ్రూవరీ, రివోర్ట్, శాంతి, సంయమనానికి చిహ్నంగా ఉన్న మహాత్మా గాంధీ వారసత్వాన్ని అపహాస్యం చేస్తూ “మహాత్మాజి” అనే బీరును విక్రయిస్తోంది. ఇది భారత విలువలకు, బిలియన్ల మంది భారతీయులకు అవమానం. ఈ విషయాన్ని రష్యాతో చర్చించాలని ప్రధాని మోదీ, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరుతున్నాను. గాంధీ మద్యం కోసం బ్రాండ్ కాదు… ఇది ఆపాలి. #RespectGandhi #India,” అని ఒక నెటిజన్ రాశారు.

Read Also : Malayalam Film Industry : మలయాళ ఇండస్ట్రీ మొత్తం బంద్.. డేట్ ప్రకటన.. షూటింగ్ లు, డిస్ట్రిబ్యూషన్, షోలు.. మొత్తం ఖతం..!

మరో నెటిజన్.. “@narendramodi మన జాతిపితకు ఏమి జరుగుతుందో చూడండి…. మోదీ జీ దయచేసి దీన్ని తీవ్రంగా పరిగణించండి” అని అన్నారు. “ఇది చాలా దారుణం, ఇలాంటి అగౌరవాన్ని వెతుక్కుంటూ మరి నిర్మూలించాలి” అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అన్నారు.

“ఒక రష్యన్ కంపెనీ మహాత్మా గాంధీ పేరు మీద బీరును అమ్ముతోంది. రష్యాలో దీనిని నిషేధించాలి, వారు మన ఉద్దేశాలతో ఆడుకుంటున్నారు. భారత్‌లో పుతిన్ ఫోటోతో బీరు అమ్మితే ఎలా ఉంటుంది” అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.