రాశి గారి ఫ**లు కామెంట్స్.. నటి రాశి సీరియస్.. లీగల్ యాక్షన్.. అనసూయపై అదిరిపోయే కౌంటర్

యాంకర్ అనసూయకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్ రాశి(Raasi).

రాశి గారి ఫ**లు కామెంట్స్.. నటి రాశి సీరియస్.. లీగల్ యాక్షన్.. అనసూయపై అదిరిపోయే కౌంటర్

Senior actress Raasi gave a befitting reply to anchor Anasuya.

Updated On : January 5, 2026 / 4:23 PM IST
  • అనసూయకి నటి రాశి కౌంటర్
  • రాశి గా*రి ఫలాలు కామెంట్ పై సీరియర్
  • లీగల్ యాక్షన్ తీసుకుందాం అనుకుందట

Raasi: హీరోయిన్స్ వస్త్రధారణపై టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఎంత వివాదం అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వివాదంలో ఆయన మహిళా కమీషన్ వరకు వెళ్లి క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది. అయితే, ఈ వివాదంలో అనూహ్యంగా అనుసయా హైలెట్ అయ్యింది. ఆడవాళ్ళ బట్టల గురించి చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ సోషల్ మీడియా వేదికగా శివాజీకి కౌటర్ ఇచ్చింది.

మా బాడీ.. మా ఇష్టం.. ఎలాంటి బట్టలైనా వేసుకుంటాం అంటూ కామెంట్స్ చేసింది. అంతటితో ఆగకుండా శివాజీపై వరుస వీడియోలు, పోస్ట్ పెట్టింది. ఈ వివాదంలో నటుడు శివాజీకి సామాన్య జనం నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది. చెప్పిన తీరు తప్పై ఉండొచ్చు కానీ, చెప్పింది మాత్రం అస్సలు తప్పు లేదు అని కామెంట్స్ చేశారు. అదే సమయంలో అనసూయకు కూడా అదిరిపోయే కౌంటర్లు ఇచ్చాడు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ హీరోయిన్ రాశి(Raasi) కూడా చేరింది.

Malavika Mohanan: ఎద అందాలతో మతిపోగోడుతున్న మాళవిక.. ఫొటోస్

అనసూయ టార్గెట్ గా అదిరిపోయే కౌంటర్లు ఇచ్చింది. పేరు చెప్పకుండానే పరువు తీసేసింది. ‘నటుడుశివాజీ చెప్పింది 100% తప్పు కాదు. కానీ, వాడిన పదాలు కొన్ని తప్పు. వాటికి ఆయన స్వారీ కూడా చెప్పారు కదా. కానీ కొంతమంది మాత్రం బాగా ఓవర్ గా మాట్లాడుతున్నారు. ఆవిడే ఓ షోకి యాంకర్ గా ఉంటూ.. రాశి గా*రి ఫలాలు అనే మాట వాడారు.

దానికి షో జడ్జిలు కూడా పగలబడి నవ్వారు. ఒక మహిళగా అలాంటి మాట ఎలా అంటారు. ఈ వివాదంపై లీగల్ గా వెళ్దామని అనుకున్నాను.. కానీ మా అమ్మ ఆపడంతో ఆగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది రాశి. దీంతో నటి రాశి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.