అలనాటి నటి సీత కన్నుమూత

  • Published By: sekhar ,Published On : September 21, 2020 / 04:38 PM IST
అలనాటి నటి సీత కన్నుమూత

Updated On : September 21, 2020 / 4:47 PM IST

Senior Actress Seetha Passes away: గతకొద్ది కాలంగా చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి.. అనారోగ్యం, వయోభారం మరియు కరోనా కారణంగా వివిధ శాఖలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు.


ఇప్పుడు అలనాటి నటి, ప్రముఖ నటుడు నాగ భూషణం సతీమణి సీత మరణించారు. ఆమె వయస్సు 87 సంవత్సరాలు.
మహా ప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తయ్యాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


వేల కొలది నాటకాల్లో నటించిన సీత స్టేజ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 300లకు పైగా సినిమాల్లో నటించారామె.
‘దేవదాసు’, ‘మాయాబజార్’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు సీత.


పలువురు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ వారి కుటంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.Seetha