Y Vijaya : సీనియర్ నటి వై.విజయకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా? చెన్నైలోనే..

తాజాగా వై విజయ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆమె ఆస్తి వివరాలు చెప్పింది.

Senior Actress Y Vijaya Tells about her Properties Details

Y Vijaya : సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు వై విజయ. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా ఇప్పుడు మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. F2 సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి ప్రేక్షకులు గుర్తుంచుకునేలా మంచి కామెడీ పాత్రని చేసారు.

తాజాగా వై విజయ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆమె ఆస్తి వివరాలు చెప్పింది.

Also Read : Fahadh Faasil : ఫహద్ ఫాజిల్ మలయాళం సూపర్ హిట్ సినిమా ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలో తెలుసా?

వై విజయ మాట్లాడుతూ.. సీనియర్ యాక్టర్స్ చాలా మంది దాన ధర్మాలు చేసి, సేవింగ్స్ చేసుకోక చివరి రోజుల్లో ఏమి లేకుండా పోయారు. నేను కాస్త సేవింగ్స్ చేసుకున్నాను. హైదరాబాద్ లో ఏ ఆస్తులు లేవు. చెన్నైలోనే ఎక్కువ ఉంటాను. చెన్నైలో నాకు మూడు ఇల్లులు, ఒక కల్యాణ మండపం, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి. కల్యాణ మండపం, కాంప్లెక్స్ మీద రెంట్స్ వస్తాయి. 1985 నుంచి 2000 వరకు నేను బిజీగా సినిమాలు చేయడంతో అప్పుడే సేవింగ్స్ చేశాను. హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకున్నాను, భవిష్యత్తులో చూడాలి. నేను ఇక్కడ ఉండను అనే నాకు తెలుగులో ఇప్పుడు ఛాన్సులు తక్కువగా వస్తున్నాయి అని తెలిపింది.

Also Read : Manchu Vishnu : వాట్.. మంచు విష్ణులో ఇంత ట్యాలెంట్ ఉందా..? హీరో కంటే ముందు ఏం చేసాడో తెలుసా..? ఇప్పుడు కన్నప్ప కోసం..