Site icon 10TV Telugu

SSMB28: మహేష్ బాబు సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఏ పాత్రలో కనిపిస్తుందో..?

Senior Heroine In Mahesh Babu SSMB28 Movie

Senior Heroine In Mahesh Babu SSMB28 Movie

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను కూడా త్రివిక్రమ్ తనదైన మార్క్ పూర్తిగా ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మనకు శాంపిల్ చూపెట్టారు.

SSMB28: బసిరెడ్డిని మించిన విలన్.. మహేష్‌తో మామూలుగా ఉండదంటున్న జగపతి బాబు!

ఇక ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలను పుష్కలంగా ఉండేలా త్రివిక్రమ్ చూస్తున్నాడట. కాగా, ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా నటిస్తున్నట్లుగా తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుందట. త్రివిక్రమ్ సినిమాల్లో సీనియర్ హీరోయిన్లకు మంచి కమ్‌బ్యాక్ ఉంటుంది. గతంలో నదియాను పవన్ కల్యాణ్ అత్తగా ‘అత్తారింటికి దారేది’లో నటింపజేసి ఆమెకు సాలిడ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు కాజోల్‌కు SSMB28 మూవీలోనూ అదిరిపోయే పాత్రను రాసి ఉంటాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ప్రస్తుతం సారథి స్టూడియోలో వేసిన ఓ సెట్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్నట్లుగా చిత్ర వర్గాలు తెలిపాయి.

SSMB28 : హాలిడే వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్ బాబు.. SSMB28 షూటింగ్ పరిస్థితి ఏంటి?

మరి కాజోల్ ఈ సినిమాలో మహేష్‌కు ఎలాంటి పాత్రలో కనిపిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమాలో అందాల భామలు పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version