SSMB28 : హాలిడే వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్ బాబు.. SSMB28 షూటింగ్ పరిస్థితి ఏంటి?

SSMB28 కొత్త షెడ్యూల్ విషయంలో మహేష్ అండ్ త్రివిక్రమ్ కి మనస్పర్థలు? అందుకనే మహేష్ హాలిడే వెకేషన్ కి చెక్కేస్తున్నాడు.

SSMB28 : హాలిడే వెకేషన్‌కి చెక్కేస్తున్న మహేష్ బాబు.. SSMB28 షూటింగ్ పరిస్థితి ఏంటి?

Mahesh Babu went to vacation before starting SSMB28 new schedule

SSMB28 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) షూటింగ్స్ లో కొంచెం గ్యాప్ వచ్చినా.. ఆ సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తుంటాడు. ఈ క్రమంలోనే విదేశాలకు హాలిడే ట్రిప్స్ వేస్తుంటాడు. ఇటీవలే టూర్ నుంచి వచ్చిన మహేష్.. మరోసారి వెకేషన్‌కి చెక్కేస్తున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం SSMB28 షూటింగ్ లో నటిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఖలేజా, అతడు మంచి ప్రజాధారణ పొందడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Mahesh Babu : మహేష్ బాబు సినిమా రిలీజ్ కోసం సుకుమార్ భార్య వెయిటింగ్.. ఏ మూవీ తెలుసా?

పూజా కార్యక్రమాలు చేసుకున్న ఎన్నో రోజులకు షూటింగ్ ప్రారంభం కావడంతో సినిమా చుట్టూ అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఇక ఈ ఆగష్టు కి రిలీజ్ చేస్తామంటూ మాట ఇచ్చిన మేకర్స్.. ఇటీవల ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ మూవీ గురించి మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయకపోవడంలో.. త్రివిక్రమ్, మహేష్ మధ్య మాటల మనస్ఫర్థలు వచ్చాయని కొన్ని వెబ్ సైట్ లు రాసుకొచ్చాయి. దీని పై ఇటీవలే సినీ నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు.

Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!

సినిమా విడుదల వచ్చే ఏడాది జనవరి. కాబట్టి మాకు చాలా సమయం ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ అందించాలంటే అలోచించి ముందుకు వెళ్ళాలి. మేము అదే చేస్తున్నాము. మొన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుంది. మే 31న మరో అప్డేట్ తో వస్తున్నామంటూ తెలియజేశాడు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయనున్నారట. ఇక గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కోసం ఫారిన్ చెక్కేస్తున్నాడు. ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న మహేష్ బాబు వీడియో అండ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu went to vacation before starting SSMB28 new schedule

Mahesh Babu went to vacation before starting SSMB28 new schedule

కాగా SSMB28 లో పూజా హెగ్డే (Pooja Hegde), శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. గుంటూరు బ్యాక్ డ్రాప్ తో ఫ్యామిలీ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.