Honor Pad X10 Pro Max : స్టూడెంట్స్‌కు స్పెషల్.. కొత్త హానర్ టాబ్లెట్ కేక.. 10,100mAh బ్యాటరీ.. 13 అంగుళాల స్క్రీన్ అదుర్స్!
Honor Pad X10 Pro Max : 10,100mAh బ్యాటరీ, 13 అంగుళాల డిస్ప్లే, డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు, ఏఐ లెర్నింగ్ ఫీచర్లతో హానర్ ప్యాడ్ ఎక్స్10 ప్రో మ్యాక్స్ చైనాలో లాంచ్ అయింది. ధర, వేరియంట్లు, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి.
Honor Pad X10 Pro Max
- ఈ టాబ్లెట్ భారీ 13-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది
- అతిపెద్ద బ్యాటరీ, రెండు కెమెరాలు ఉన్నాయి
- టాబ్లెట్‌లో అనేక ఏఐ ఫీచర్లు స్పెషల్ అట్రాక్షన్
Honor Pad X10 Pro Max : హానర్ లవర్స్ ఎంజాయ్.. భారీ డిస్ప్లేతో హానర్ ప్యాడ్ వచ్చేసింది. బిగ్ స్క్రీన్, భారీ బ్యాటరీ, ఏఐ ఫీచర్లతో ఈ టాబ్లెట్ అద్భుతంగా ఉంది. కొత్త టాబ్లెట్ కొనేందుకు చూస్తున్నవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హానర్ కొత్త టాబ్లెట్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ చైనా మార్కెట్లో లాంచ్ అయింది.
13 అంగుళాల భారీ డిస్ప్లేతో పాటు 10,100mAh బ్యాటరీ అందించారు. చదువుకునే విద్యార్థుల నుంచి వీడియో కాల్స్, ఎంటర్టైన్మెంట్ కోసం టాబ్లెట్ వాడేవారి వరకు ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ టాబ్లెట్‌లో అనేక ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ధర, ఇతర ఫీచర్లను వివరంగా పరిశీలిద్దాం..
Read Also : Apple Layoffs : ఆపిల్‌లో మరోసారి లేఆఫ్స్.. AI దెబ్బకు 200కుపైగా ఉద్యోగాలు ఫట్!
ధర ఎంతంటే? :
హానర్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ ధరను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే, అధికారిక వెబ్సైట్లో టాబ్లెట్ లిస్ట్ చేసింది. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. కాంగ్షాన్ గ్రే, ఫారెస్ట్ గ్రీన్ అనే 2 కలర్ ఆప్షన్లలో లభించనుంది. వై-ఫై వేరియంట్లలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 6GB + 256GB, 8GB + 256GB మోడల్స్ ఉన్నాయి. చైనాలో ఈ టాబ్లెట్ సేల్స్ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానున్నాయి.
13 అంగుళాల డిస్ప్లే, భారీ బ్యాటరీ :
ఈ టాబ్లెట్‌లో స్పెషల్ అట్రాక్షన్ అంటే.. 13 అంగుళాల భారీ డిస్ప్లే. సినిమాలు, ఆన్లైన్ క్లాసులు, స్టడీ, మల్టీటాస్కింగ్‌కు ఈ బిగ్ స్క్రీన్ అద్భుతంగా ఉంటుంది. మరోవైపు 10,100mAh బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు వాడినా ఛార్జింగ్ వెంటనే దిగదు. లాంగ్ టైమ్ వస్తుంది.
డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు.. ఏఐ ఫీచర్లు హైలైట్ :
కెమెరాల పరంగా పరిశీలిస్తే.. హానర్ స్పెషల్ ఫోకస్ కెమెరాలపైనే పెట్టినట్టు కనిపిస్తోంది. ఇందులో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉండగా, ఫ్రంట్ సైడ్ 8MP మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు చాలా అద్భుతంగా ఉంటుంది.
అలాగే, హానర్ ట్యాబ్ విద్యార్థుల స్టడీకి సంబంధించి అనేక ఏఐ ఫీచర్లను అందిస్తోంది. వన్-టు-వన్ స్టడీ గైడెన్స్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తంగా చూస్తే భారీ డిస్ప్లే, బ్యాటరీతో పాటు ఏఐ ఆధారిత లెర్నింగ్ ఫీచర్లతో హానర్ ప్యాడ్ X10 ప్రో మ్యాక్స్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
