Senior Hero's finding for heroines
Senior Hero’s : 50 ప్లస్ ఏజున్న హీరోతో అతడి కన్నా ఎన్నో ఏళ్ళు చిన్నదైన హీరోయిన్ చిందేయడం టాలీవుడ్(Tollywood) లో క్వైట్ కామన్. అయితే ప్రజెంట్ తమ అప్ కమింగ్ మూవీస్ లో కూడా ఎంతో ఏజ్ గ్యాప్ ఉన్న హీరోయిన్స్ తో ఎంగేజ్ అవుతున్నారు కొందరు సీనియర్ హీరోలు. సీనియర్ హీరోలకు వాళ్లకు తగ్గ హీరోయిన్స్(Heroins) దొరకపట్టడానికి చాలానే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్స్. కానీ దొరకకపోవడంతో ఉన్న హీరోయిన్స్ లోనే ఎవరో ఒకర్ని వాళ్ళకి మ్యాచ్ చేస్తున్నారు. ఇప్పుడు అలా సీనియర్ హీరోస్ అంతా తమకంటే ఏజ్ లో చాలా చిన్నవాళ్ళతో జత కడుతున్నారు.
63 ఏళ్ళ విక్టరీ వెంకటేశ్ తన అప్ కమింగ్ మూవీ ‘సైంధవ్’ కోసం తన కన్నా 30 ఏళ్ళ చిన్నదైన శ్రద్ధ శ్రీనాథ్ తో రొమాన్స్ చేయబోతున్నారు. ఆమెను హీరోయిన్ గా అఫీషియల్ గా ఇటీవలే అనౌన్స్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి 67 ఏళ్ల సీనియర్ హీరో తన ఏజ్ ని మ్యాచ్ చేసే హీరోయిన్లు లేకపోవడంతో తనకంటే 30ఏళ్లు చిన్న వాళ్లైన హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లో తనకంటే 30 ఏళ్ళు చిన్నదైన శృతిహాసన్ తో డ్యూయెట్లు పాడారు, రొమాన్స్ చేశారు చిరు. అప్ కమింగ్ మూవీ ‘భోళాశంకర్’ లో తనకంటే 35 ఏళ్లు చిన్నదైన తమన్నాతో ఆడిపాడుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 50 ప్లస్ ఏజ్ లో ఉన్నారు. ఆయన కూడా తన అప్ కమింగ్ మూవీస్ లో తన కన్నా ఎన్నోఏళ్ళు చిన్నవారైన హీరోయిన్స్ తో రొమాన్స్ కు రెడీ అయిపోయారు. హరిహర వీరమల్లులో తనకన్నా 21 ఏళ్ళు చిన్నదైన నిధి అగర్వాల్ ఆయనతో రొమాన్స్ చేయబోతోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో తనకన్నా 30 ఏళ్ళు చిన్నదైన శ్రీలీల ఆయనతో డ్యూయెట్స్ పాడటానికి రెడీ అయిపోయింది. ఇక సుజిత్ డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్ళబోయే ఓజీలో సైతం పవన్ కళ్యాణ్ తన కన్నా 23 ఏళ్ళ చిన్నదైన ప్రియాంకా అరుళ్ మోహన్ తో రొమాన్స్ చేయబోతున్నారు.
Akhil : 170 అడుగుల మీద నుంచి దూకేసిన అఖిల్.. ప్రమోషన్స్ కోసం మరీ ఈ రేంజ్ స్టంట్స్ అవసరమా ?
నటసింహ నందమూరి బాలకృష్ణ నెక్స్ట్ మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య 108వ సినిమాగా తెరకెక్కుతున్న దీంట్లో ఆయన సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్ కన్నా బాలయ్య 25 ఏళ్ళు పెద్ద. ఇక మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న నూపుర్ సనన్ రవితేజ కన్నా 25 ఏళ్ళు చిన్నది. అక్కినేని నాగార్జున నెక్స్ట్ మూవీ కోసం హీరోయిన్ గా ఆయన కన్నా 38 ఏళ్ళు చిన్నదైన మానస వారణాసిని తీసుకున్నట్టు సమాచారం. ఇలా సీనియర్ హీరోలంతా తమకంటే చాలా చిన్నవాళ్ళైనా హీరోయిన్స్ తోనే నటించాల్సి వస్తుంది. గతంలో కూడా ఐలా జరిగినా ఇప్పుడు ప్రతి సినిమాలోనూ అదే కనిపిస్తుంది.