Akhil : 170 అడుగుల మీద నుంచి దూకేసిన అఖిల్.. ప్రమోషన్స్ కోసం మరీ ఈ రేంజ్ స్టంట్స్ అవసరమా ?

ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు.

Akhil : 170 అడుగుల మీద నుంచి దూకేసిన అఖిల్.. ప్రమోషన్స్ కోసం మరీ ఈ రేంజ్ స్టంట్స్ అవసరమా ?

Akkineni Akhil Jumping from 172 feet for Agent Promotions

Updated On : April 16, 2023 / 5:49 PM IST

Akhil :  అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఏజెంట్(Agent) సినిమా కోసం గత రెండేళ్లుగా కష్టపడ్డాడు. కెరీర్ లో మొదటి సారి పూర్తి మాస్, యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు అఖిల్. ఇప్పటివరకు వచ్చిన అఖిల్ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) తప్ప మిగిలిన సినిమాలన్నీ చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. దీంతో అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో అనిల్ సుంకర(Anil Sunkara) నిర్మాణంలో, సాక్షి వైద్య హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి ముఖ్య పాత్రలో ఏజెంట్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఈ సినిమా కోసం అఖిల్ బాగా కష్టపడ్డాడు, సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అయితే ఏజెంట్ టీం ప్రమోషన్స్ ని సరికొత్తగా చేస్తున్నారు. తాజాగా విజయవాడలో PVP మాల్ వద్ద ట్రైలర్ టైం అనౌన్సమెంట్ అంటూ సరికొత్త ప్రమోషన్స్ చేశారు. విజయవాడలో PVP మాల్ వద్ద ఏజెంట్ ప్రమోషన్స్ నిర్వహించగా ఇక్కడ అఖిల్ 172 అడుగుల మీద నుంచి క్రేన్, తాళ్ల సహాయంతో కిందకి దూకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చాడు.

Ranbir Kapoor : నేను మంచి భర్తను కాదు.. రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యలు

PVP మాల్ బిల్డింగ్ పైనుంచి అఖిల్ దూకగా కింద అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. అఖిల్ కిందకు దిగుతుంటే అఖిల్ పై పూల వర్షం, పేపర్స్ కురిపించారు. విజయవాడ ఫ్యాన్స్ అఖిల్ కి గ్రాండ్ గా స్వాగతం పలికారు. అఖిల్ పై నుంచి ఇలా తాళ్ల సాయంతో దూకిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారగా ప్రమోషన్స్ కోసం మరీ ఈ రేంజ్ లో స్టంట్స్ అవసరమా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అఖిల్ అభిమానులు అయితే ప్రమోషన్స్ కోసం అఖిల్ డేర్ చేస్తున్నాడు, ఎవ్వరూ చేయని విధంగా చేస్తున్నాడు, సరికొత్తగా ట్రై చేస్తున్నాడు అంటూ అభినందిస్తున్నారు.