Yadavalli Lakshmi Narasimha Sastri : సినీ పరిశ్రమలో మరో విషాదం.. సీనియర్ రచయిత, సెన్సార్ బోర్డు మెంబర్ కన్నుమూత..
ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా పలువురు ప్రముఖులు మరణించి విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ రచయిత మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. జర్నలిస్ట్ గా, కవిగా, పుస్తక రచయితగా, సినిమా రచయితగా తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో పనిచేసిన యడవల్లి వెంకట లక్ష్మి నరసింహ శాస్త్రి.............

senior writer Yadavalli venkata Lakshmi Narasimha Sastri passed away
Yadavalli Lakshmi Narasimha Sastri : ఇటీవల సినీ పరిశ్రమలో వరుసగా పలువురు ప్రముఖులు మరణించి విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ రచయిత మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. జర్నలిస్ట్ గా, కవిగా, పుస్తక రచయితగా, సినిమా రచయితగా తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమలలో పనిచేసిన యడవల్లి వెంకట లక్ష్మి నరసింహ శాస్త్రి శనివారం రాత్రి మరణించారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి విజయవాడలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు.
CCL 2023 : సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఏ టీంకి కెప్టెన్ ఎవరో తెలుసా? తెలుగు వారియర్స్ కెప్టెన్ ?
తెలుగు, కన్నడ, తమిళ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేశారు యడవల్లి వెంకట లక్ష్మి నరసింహ శాస్త్రి. ప్రస్తుతం ఆయన కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ సభ్యులుగా కూడా ఉన్నారు. ఒక తమిళ సినిమాని దర్శకుడిగా కూడా తెరకెక్కించారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ కి కూడా ఆయన కథలు అందించారు. అయన రాసిన కవితలు, రచనలను మెచ్చి గతంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలిచి మరీ ప్రశంసించారు. ఆయనకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.