Comedian Ali : నిర్మాతగా మారిన సీనియర్ జర్నలిస్ట్.. అలీ చేతుల మీదుగా..

నేడు ఉదయం శివమ్‌ మీడియా లోగో, బ్యానర్‌ను కమెడియన్ అలీ చేతుల మీదుగా ప్రారంభించారు.

Seniour Film Journalist Siva Mallala Turned as Producer Banner Launch by Comedian Ali

Comedian Ali : టాలీవుడ్ లో మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభం అయింది. సీనియర్‌ జర్నలిస్ట్‌ శివ మల్లాల నిర్మాతగా మారుతూ ‘శివమ్‌ మీడియా’ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించారు. సినిమా జర్నలిస్ట్ గా మొదలుపెట్టి సీనియర్ జర్నలిస్ట్ గా ఎదిగి అనంతరం PRO గా మారి ఇప్పుడు నిర్మాతగా మారారు శివ మల్లాల. నేడు ఉదయం శివమ్‌ మీడియా లోగో, బ్యానర్‌ను కమెడియన్ అలీ చేతుల మీదుగా ప్రారంభించారు.

Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? స్టేజిపై లీక్ చేసిన విశ్వక్.. టైటిల్ భలే ఉందే..

ఈ కార్యక్రమంలో అలీతో పాటు దర్శకులు అనిల్ కడియాల, నటి, నిర్మాత ప్రవీణా కడియాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా నాకు శివ ఒక తమ్ముడిలా చాలా క్లోజ్. కింద స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు నిర్మాతగా మారి సినిమా తీస్తునందుకు సంతోషంగా ఉంది అని తెలిపారు. అనిల్ కడియాల, ప్రవీణ కడియాల శివ మల్లాలకు శుభాకాంక్షలు తెలిపి తీయబోయే సినిమాకు, నిర్మాణ సంస్థకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. త్వరలోనే శివమ్‌ మీడియా బ్యానర్ పై మొదలు పెట్టిన సినిమా పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాత శివ మల్లాల తెలిపారు.