క్రేజ్ కొండెక్కి కూర్చుందిగా!
2019 ఫోర్బ్స్ ఇండియా '30 అండర్ 30' లో ప్లేస్ దక్కించుకున్నాడు విజయ్.

2019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లో ప్లేస్ దక్కించుకున్నాడు విజయ్.
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరో అరుదైన ఘనత సాధించాడు. 2019 ఫోర్బ్స్ ఇండియా ’30 అండర్ 30′ లో ప్లేస్ దక్కించుకున్నాడు విజయ్.. భారత్‌లో 30 ఇయర్స్ లోపు వాళ్ళు, వారి వారి ఫీల్డ్స్‌లో అద్భుత ప్రతిభ కనబరచిన వారి లిస్ట్‌ను ఫోర్బ్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసింది. నటుడి క్యాటగిరీలో విజయ్‌కి ప్లేస్ దక్కింది. మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, అథ్లెట్ హిమాదాస్‌లకూ చోటు దక్కడం విశేషం. విజయ్ దేవరకొండ 2011లో నువ్విలా సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసాడు..
2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌లో గెస్ట్‌గా కనిపించి అలరించాడు.. ఎవడే సుబ్రమణ్యంతో గుర్తింపు వచ్చింది. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా వంటి సూపర్ హిట్ సినిమాలతో తన క్రేజ్ కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్‌తో పాటు, క్రాంతిమాధవ్ డైరెక్షన్‌లోనూ సినిమా చేస్తున్నాడు విజయ్.