Xiaomi 14 Civi : షావోమీ ఫ్యాన్స్‌కు పండగే.. Xiaomi 14 Civi ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Xiaomi 14 Civi : షావోమీ 14 Civi ఫోన్ డిస్కౌంట్ అదిరింది.. అమెజాన్‌లో ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

Xiaomi 14 Civi : షావోమీ ఫ్యాన్స్‌కు పండగే.. Xiaomi 14 Civi ఫోన్ ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?

Xiaomi 14 Civi price

Updated On : September 12, 2025 / 7:50 PM IST

Xiaomi 14 Civi : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. షావోమీ అభిమానులకు ఇదో అద్భుతమైన ఆఫర్.. ఇప్పుడు అమెజాన్‌లో షావోమీ 14 సివి భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఏకంగా రూ. 14,500 కన్నా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.

సరసమైన ధరకు ప్రీమియం (Xiaomi 14 Civi) స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారికి ఇదే సరైన సమయం. షావోమీ 14 సివి ప్రత్యేకమైన డిజైన్, అద్భుతమైన డిస్‌ప్లే, పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, మల్టీఫేస్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. ఈ క్రేజీ డీల్ వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

షావోమీ 14 సివి అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో షావోమీ 14 సివి రూ.42,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.28,390కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ షావోమీ 14 సివిపై రూ.14,609 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.

Read Also : Apple iPhone 16 Plus : సూపర్ ఆఫర్ భయ్యా.. ఐఫోన్ 16 ప్లస్ చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

షావోమీ 14 సివి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
షావోమీ 14 సివి 1.5K పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే HDR10+, డాల్బీ విజన్, 68-బిట్ కలర్, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఇంకా, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

షావోమీ 14 సివి ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4700mAh బ్యాటరీతో వస్తుంది. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. షావోమీ 14 సివి హ్యాండ్‌సెట్‌లో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో PDAF, OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో సెన్సార్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‌లో రెండు 32MP కెమెరాలు కూడా ఉన్నాయి.